Aanalimkaa maanavaa prahlaadavaradaa

ఆనలింకా మానవా ప్రహ్లాదవరదా
Language

(॥పల్లవి॥)
ఆనలింకా మానవా ప్రహ్లాదవరదా
నానెఁ జెమటఁ జెక్కులు నవ్వులింత చాలదా

(॥ఆన॥)
పిప్పిచేసితివి మోవి బెదరించితివి నీవి
అప్పటి నాసోదమా ప్రహ్లాదవరదా
కొప్పు జారఁజేసితివి కొంగువట్టితీసితివి
రెప్పలెత్తి చూచే వింకా రేసెంత గలదో

(॥ఆన॥)
మానముపైఁ దిట్టితివి మర్మము చేముట్టితి
ఐన నింతచాలదా ప్రహ్లాదవరదా
మేనెల్లఁ జొక్కించితివి మేకుల దక్కించితివి
శేననవ్వులు నవ్వేవు సేఁత లింత చాలదా,

(॥ఆన॥)
చెక్కుఁ గడునొక్కితివి చేతులెత్తి మొక్కితివి
అక్కరింకానేఁటికి ప్రహ్లాదవరదా
యెక్కువ శ్రీవేంకటాద్రి నిరవైనదేవుఁడవు
దక్కి నన్నుఁ గూడితివి తమి యెంతగలదో

(||pallavi||)
ānaliṁkā mānavā prahlādavaradā
nānĕm̐ jĕmaḍam̐ jĕkkulu navvuliṁta sāladā

(||āna||)
pippisesidivi movi bĕdariṁchidivi nīvi
appaḍi nāsodamā prahlādavaradā
kŏppu jāram̐jesidivi kŏṁguvaṭṭidīsidivi
rĕppalĕtti sūse viṁkā resĕṁta galado

(||āna||)
mānamubaim̐ diṭṭidivi marmamu semuṭṭidi
aina niṁtasāladā prahlādavaradā
menĕllam̐ jŏkkiṁchidivi megula dakkiṁchidivi
śhenanavvulu navvevu sem̐ta liṁta sāladā,

(||āna||)
sĕkkum̐ gaḍunŏkkidivi sedulĕtti mŏkkidivi
akkariṁkānem̐ṭigi prahlādavaradā
yĕkkuva śhrīveṁkaḍādri niravainadevum̐ḍavu
dakki nannum̐ gūḍidivi tami yĕṁtagalado