ఆనలేలయ్యా నీవాడినట్టె ఆడేము
(॥పల్లవి॥)
ఆనలేలయ్యా నీవాడినట్టె ఆడేము
పూనిన నీ మనసులో పూఁపక మేదయ్యా
(॥ఆన॥)
సన్నల నాకెకు నీకు సాకిరి చెప్పుమనేవు
అన్నట్టే నీమాట లవిగోవయ్య
మిన్నక తిట్టే వందుకు మించి వెంగెములంటా
యిన్నిటా దొరవు నిన్ను నేమనందునయ్యా
(॥ఆన॥)
అప్పటి మొక్కించుమనే వాకెనే నీముందట
చెప్పినట్టేల్లా నింకఁ జేసేమయ్యా
రెప్ప వెట్టక చూచేవు రేసు నెరుపేనంటా
దెప్పరాలు నీకు నీవే తెలుసుకోవయ్యా
(॥ఆన॥)
కందువ నీ వెదురేఁగి కాఁగిలించితి వాకెను
అందరికి వొక్కమన సాయనయ్యా
అందపు శ్రీవేంకటేశ అంతలో మమ్ము మెచ్చేవు
విందువంటి మావంక వెలుతు లేవయ్యా
(||pallavi||)
ānalelayyā nīvāḍinaṭṭĕ āḍemu
pūnina nī manasulo pūm̐paga medayyā
(||āna||)
sannala nāgĕgu nīgu sāgiri sĕppumanevu
annaṭṭe nīmāḍa lavigovayya
minnaga tiṭṭe vaṁdugu miṁchi vĕṁgĕmulaṁṭā
yinniḍā dŏravu ninnu nemanaṁdunayyā
(||āna||)
appaḍi mŏkkiṁchumane vāgĕne nīmuṁdaḍa
sĕppinaṭṭellā niṁkam̐ jesemayyā
rĕppa vĕṭṭaga sūsevu resu nĕrubenaṁṭā
dĕpparālu nīgu nīve tĕlusugovayyā
(||āna||)
kaṁduva nī vĕdurem̐gi kām̐giliṁchidi vāgĕnu
aṁdarigi vŏkkamana sāyanayyā
aṁdabu śhrīveṁkaḍeśha aṁtalo mammu mĕchchevu
viṁduvaṁṭi māvaṁka vĕludu levayyā