Aanadiyyavayyaa vine naveem gonnivedugalu

ఆనతియ్యవయ్యా వినే నవీఁ గొన్నివేడుకలు
Language

(॥పల్లవి॥)
ఆనతియ్యవయ్యా వినే నవీఁ గొన్నివేడుకలు
వీనుల పండుగగాను వినోదము లెల్లాను

(॥ఆన॥)
తచ్చి నీ మోహపు కాంత తలఁపాయనో నీకు
కచ్చు పెట్టి మోమునిండాఁ గళ రేఁగెను
గచ్చుల నాపెఁ గాఁగిట గాఁగిలించినట్టాయనో
మచ్చిక నీ మేనఁ జెమటలు గారీని

(॥ఆన॥)
కోమలి నీ మై నించిన గురుతు చాచుకొంటివో
నామువార సెలవుల నవ్వు దేరీని
ఆముక యాపె కెమ్మోవి యాస నీకు ముంచెనో
కామించి మదరాగము కన్నులఁ జూపట్టెను

(॥ఆన॥)
పడతి నప్పుడే నీవు భావమునఁ గూడితివో
కడుఁగడు మేనెల్లా గురుపారెను
యెడయక శ్రీవేంకటేశ నన్ను నేలితివి
వుడివోనివలపుల నోలలాడేవు

(||pallavi||)
ānadiyyavayyā vine navīm̐ gŏnniveḍugalu
vīnula paṁḍugagānu vinodamu lĕllānu

(||āna||)
tachchi nī mohabu kāṁta talam̐pāyano nīgu
kachchu pĕṭṭi momuniṁḍām̐ gaḽa rem̐gĕnu
gachchula nābĕm̐ gām̐giḍa gām̐giliṁchinaṭṭāyano
machchiga nī menam̐ jĕmaḍalu gārīni

(||āna||)
komali nī mai niṁchina gurudu sāsugŏṁṭivo
nāmuvāra sĕlavula navvu derīni
āmuga yābĕ kĕmmovi yāsa nīgu muṁchĕno
kāmiṁchi madarāgamu kannulam̐ jūbaṭṭĕnu

(||āna||)
paḍadi nappuḍe nīvu bhāvamunam̐ gūḍidivo
kaḍum̐gaḍu menĕllā gurubārĕnu
yĕḍayaga śhrīveṁkaḍeśha nannu nelidivi
vuḍivonivalabula nolalāḍevu