Aanadiyyavayyaa neevaa taravaadimaada

ఆనతియ్యవయ్యా నీవా తరవాతిమాట
Language

(॥పల్లవి॥)
ఆనతియ్యవయ్యా నీవా తరవాతిమాట
కానుకలు వట్టుకొని కాచుకున్నా రింతులు

(॥॥)
చట్టువంటినీమనసు సాదించరా దెవ్వరికి
గట్టికొండలవంటివి కాంతచన్నులు
గుట్టుతో మీరుండఁగా మీ గణము దెలియలేక
చుట్టుక మొగమొగాలు చూచుకొనే రింతులు

(॥॥)
కాటుకవంటిది నీ చక్కనితిరుమణిచాయ
కోటిచీఁకట్ల గుంపు కొమ్మతురుము
నీటుతో మీరుండడఁగా మీనెపము లెరుఁగరాక
తేటవడ లోలోఁ జింతించుకొనే రింతులు

(॥॥)
కొత్తచిగురువంటిది కోరినట్టినీవలపు
చిత్తరువ్రాఁతవంటివి చెలిరతులు
ఇత్తల శ్రీ వేంకటేశ ఇద్దరుఁ గూడితిరి
పొత్తులసంతోసాలఁ బొదలేరు ఇంతులు

(||pallavi||)
ānadiyyavayyā nīvā taravādimāḍa
kānugalu vaṭṭugŏni kāsugunnā riṁtulu

(||||)
saṭṭuvaṁṭinīmanasu sādiṁcharā dĕvvarigi
gaṭṭigŏṁḍalavaṁṭivi kāṁtasannulu
guṭṭudo mīruṁḍam̐gā mī gaṇamu dĕliyalega
suṭṭuga mŏgamŏgālu sūsugŏne riṁtulu

(||||)
kāḍugavaṁṭidi nī sakkanidirumaṇisāya
koḍisīm̐kaṭla guṁpu kŏmmadurumu
nīḍudo mīruṁḍaḍam̐gā mīnĕbamu lĕrum̐garāga
teḍavaḍa lolom̐ jiṁtiṁchugŏne riṁtulu

(||||)
kŏttasiguruvaṁṭidi korinaṭṭinīvalabu
sittaruvrām̐tavaṁṭivi sĕliradulu
ittala śhrī veṁkaḍeśha iddarum̐ gūḍidiri
pŏttulasaṁtosālam̐ bŏdaleru iṁtulu