ఆనతియ్యవయ్యా నాకు నాసుద్దులు
(॥పల్లవి॥)
ఆనతియ్యవయ్యా నాకు నాసుద్దులు
తానకమై ఇందాఁకాఁ దలపోసుకొంటిని
(॥ఆన॥)
చెలఁగి నిన్నాపె చూచి సెలవుల నవ్వఁగాను
తెలయక నిన్నడిగేఁ దెల్లమిగాను
బలిమి నప్పటి గాపెపైఁ జేఇవేయఁగాను
నిలుచుండి నాలోనే నివ్వెర గందితిని
(॥ఆన॥)
సారెసారె నాపె నీతో సన్నలు సేయఁగాను
కారణాలు విచారించ గడగడల
మేరమీరి నీతోమరి మేలము లాడఁగాను
ఆరీతినే సంతోసించే నందుకే నేను
(॥ఆన॥)
గక్కన నాపె నిన్నుఁ గాఁగిలించుకొనఁగాను
చొక్కి పొంతనాలు చూచే సొరిది నేఁడు
ఇక్కడ శ్రీవేంకటేశ ఇటు నన్నుఁ గూడితిని
పెక్కులాగుల నిందుకే ప్రియమందే నిపుడు
(||pallavi||)
ānadiyyavayyā nāgu nāsuddulu
tānagamai iṁdām̐kām̐ dalabosugŏṁṭini
(||āna||)
sĕlam̐gi ninnābĕ sūsi sĕlavula navvam̐gānu
tĕlayaga ninnaḍigem̐ dĕllamigānu
balimi nappaḍi gābĕbaim̐ jeiveyam̐gānu
nilusuṁḍi nālone nivvĕra gaṁdidini
(||āna||)
sārĕsārĕ nābĕ nīdo sannalu seyam̐gānu
kāraṇālu visāriṁcha gaḍagaḍala
meramīri nīdomari melamu lāḍam̐gānu
ārīdine saṁtosiṁche naṁduge nenu
(||āna||)
gakkana nābĕ ninnum̐ gām̐giliṁchugŏnam̐gānu
sŏkki pŏṁtanālu sūse sŏridi nem̐ḍu
ikkaḍa śhrīveṁkaḍeśha iḍu nannum̐ gūḍidini
pĕkkulāgula niṁduge priyamaṁde nibuḍu