ఆనతియ్యవయ్యా నాతో నక్కడి సుద్దు లెల్లాను
(॥పల్లవి॥)
ఆనతియ్యవయ్యా నాతో నక్కడి సుద్దు లెల్లాను
పూని నా కాఁగిట నిట్టె భోగించేవుగాని
(॥ఆన॥)
ఇందాఁకా నీ వాకె ఇంటనుండి వచ్చితివి
విందు వెట్టెనా నీకు వేడుకతోను
గందము పూసుకొంటివా కానవచ్చీ మేనను
పొందుగ విడెమిచ్చెనా పుక్కిట నీకున్నది
(॥ఆన॥)
నానిన చెమటలతో నవ్వుతా నున్నాఁడవు
పానుపు వరచెనా పాదాలొతైనా
వీనులలో నేమైనా విన్నపాలు సేసెనా
ఆనెనా చన్నులు వురమందు గురుతున్నది
(॥ఆన॥)
గరిమతో సంతోసాలు కానిపించీ నీమోమున
సరసము లాడెనా చల్లెనా సేస
యిరవై శ్రీవేంకటేశ యీడ నన్ను నేలితివి
మరిగి తాఁ గూడెనా నీమనసులో నున్నది
(||pallavi||)
ānadiyyavayyā nādo nakkaḍi suddu lĕllānu
pūni nā kām̐giḍa niṭṭĕ bhogiṁchevugāni
(||āna||)
iṁdām̐kā nī vāgĕ iṁṭanuṁḍi vachchidivi
viṁdu vĕṭṭĕnā nīgu veḍugadonu
gaṁdamu pūsugŏṁṭivā kānavachchī menanu
pŏṁduga viḍĕmichchĕnā pukkiḍa nīgunnadi
(||āna||)
nānina sĕmaḍalado navvudā nunnām̐ḍavu
pānubu varasĕnā pādālŏdainā
vīnulalo nemainā vinnabālu sesĕnā
ānĕnā sannulu vuramaṁdu gurudunnadi
(||āna||)
garimado saṁtosālu kānibiṁchī nīmomuna
sarasamu lāḍĕnā sallĕnā sesa
yiravai śhrīveṁkaḍeśha yīḍa nannu nelidivi
marigi tām̐ gūḍĕnā nīmanasulo nunnadi