Aanadiyyavayyaa naado naamelu vine nenu

ఆనతియ్యవయ్యా నాతో నామేలు వినే నేను
Language

(॥పల్లవి॥)
ఆనతియ్యవయ్యా నాతో నామేలు వినే నేను
తానకమై ఇన్నిటాను తనివి నొందించెనా

(॥ఆన॥)
మొక్కలాన నేఁడు నీమోమునఁ గళలు నిండె
చెక్కులు నొక్కెనా ఆపె సేదదేర్చెనా
చిక్కనిచెమటలతో చిందువందై వున్నాఁడవు
కక్కసించి మరీ నట్టె కాలుదొక్కెనా

(॥ఆన॥)
నవకపు సెలవులనవ్వు వెన్నెలలు గాసీ
చవి చూపెనా మోవి; చాఁచెనాచేయి
అవల నీ వల్లాఁ జూచి అలసేవు నీలోనే
జవళిఁ గాఁగిటిలోనే సాముసేయించెనా

(॥ఆన॥)
చిత్తగించి నన్నుఁ జూచి సిగ్గులుపడే విదె
పొత్తు గుడిపించెనా భోగించెనా
యిత్తల శ్రీవేంకటేశ యిటు నన్నుఁ గూడితివి
హత్తించెనా పొందు అట్టె యిందు వచ్చెనా

(||pallavi||)
ānadiyyavayyā nādo nāmelu vine nenu
tānagamai inniḍānu tanivi nŏṁdiṁchĕnā

(||āna||)
mŏkkalāna nem̐ḍu nīmomunam̐ gaḽalu niṁḍĕ
sĕkkulu nŏkkĕnā ābĕ sedadersĕnā
sikkanisĕmaḍalado siṁduvaṁdai vunnām̐ḍavu
kakkasiṁchi marī naṭṭĕ kāludŏkkĕnā

(||āna||)
navagabu sĕlavulanavvu vĕnnĕlalu gāsī
savi sūbĕnā movi; sām̐sĕnāseyi
avala nī vallām̐ jūsi alasevu nīlone
javaḽim̐ gām̐giḍilone sāmuseyiṁchĕnā

(||āna||)
sittagiṁchi nannum̐ jūsi siggulubaḍe vidĕ
pŏttu guḍibiṁchĕnā bhogiṁchĕnā
yittala śhrīveṁkaḍeśha yiḍu nannum̐ gūḍidivi
hattiṁchĕnā pŏṁdu aṭṭĕ yiṁdu vachchĕnā