ఆనతియ్యవయ్యా మాట అమర జోడించుకొని
(॥పల్లవి॥)
ఆనతియ్యవయ్యా మాట అమర జోడించుకొని
వీనులారా నే నది విని మెచ్చేఁగాని
(॥ఆన॥)
పచ్చిదేర నవ్వి నీకు బాదము లొత్తుచు నింతి
విచ్చనవిడి నన్నియు విన్నవించెను
కచ్చుపెట్టి నీవు నట్టె కన్నులా నోరా వింటివి
హెచ్చి ఇందువంకను మేలేమి గంటివయ్యా
(॥ఆన॥)
చిమ్ముఁ జూపులనుఁ జూచి చేతివిడెమిచ్చి లేమ
యెమ్మెలఁ దనవలపు లెరుకసేసె
సమ్మతించితివి నీవు సరికి బేసికి నిట్టె
కమ్మర నీకేమి దారుకాణవచ్చె ననియా
(॥ఆన॥)
యేకతానఁ గాఁగిలించి ఇట్టె యలమేలుమంగ
దాకొని శ్రీవేంకటేశ తలఁపించెను
ఆకడ నన్నేలియును అవియు నియ్యకొంటివి
కైకొని అందునా నేమి గట్టుకొంటివయ్యా
(||pallavi||)
ānadiyyavayyā māḍa amara joḍiṁchugŏni
vīnulārā ne nadi vini mĕchchem̐gāni
(||āna||)
pachchidera navvi nīgu bādamu lŏttusu niṁti
vichchanaviḍi nanniyu vinnaviṁchĕnu
kachchubĕṭṭi nīvu naṭṭĕ kannulā norā viṁṭivi
hĕchchi iṁduvaṁkanu melemi gaṁṭivayyā
(||āna||)
simmum̐ jūbulanum̐ jūsi sediviḍĕmichchi lema
yĕmmĕlam̐ danavalabu lĕrugasesĕ
sammadiṁchidivi nīvu sarigi besigi niṭṭĕ
kammara nīgemi dārugāṇavachchĕ naniyā
(||āna||)
yegadānam̐ gām̐giliṁchi iṭṭĕ yalamelumaṁga
dāgŏni śhrīveṁkaḍeśha talam̐piṁchĕnu
āgaḍa nanneliyunu aviyu niyyagŏṁṭivi
kaigŏni aṁdunā nemi gaṭṭugŏṁṭivayyā