Aanadiyyavayyaa amdugu maamteṟumgudu

ఆనతియ్యవయ్యా అందుకు మాఁటెఱుఁగుదు
Language

(॥పల్లవి॥)
ఆనతియ్యవయ్యా అందుకు మాఁటెఱుఁగుదు
పూని అందరిని నీకుఁ బొందుసేసేను

(॥ఆన॥)
వసివాడు మోముతోడ వంచుకొనేవు శిరసు
దెసల నెవ్వతెయైనాఁ దిట్టదుగదా
అసురుసురౌతాను అలసేవు పలుమారు
పిసికి ని న్నెవ్వతైనాఁ బిప్పిసేసెనో

(॥ఆన॥)
వుడుకుఁ జెమటతోడ నొరగేవు మలగుపై
కడనెవ్వతైనా నలుగదుగదా
చిడుముడితోఁ గొంత చిన్నఁబోయివున్నాఁడవు
పడఁతి యెవ్వ తెయైనాఁ బంతమాడెనో

(॥ఆన॥)
నిండుఁగళలతోడుత నివ్వెరగైనాఁడవు
అండనెవ్వతైనా మర్మా లంటదు గదా
దండిగా శ్రీవేంకటేశ తగ నన్ను నేలితివి
చండిపెట్టి యెవ్వతైనా సారెకు బోధించెనో

(||pallavi||)
ānadiyyavayyā aṁdugu mām̐ṭĕṟum̐gudu
pūni aṁdarini nīgum̐ bŏṁdusesenu

(||āna||)
vasivāḍu momudoḍa vaṁchugŏnevu śhirasu
dĕsala nĕvvadĕyainām̐ diṭṭadugadā
asurusuraudānu alasevu palumāru
pisigi ni nnĕvvadainām̐ bippisesĕno

(||āna||)
vuḍugum̐ jĕmaḍadoḍa nŏragevu malagubai
kaḍanĕvvadainā nalugadugadā
siḍumuḍidom̐ gŏṁta sinnam̐boyivunnām̐ḍavu
paḍam̐ti yĕvva tĕyainām̐ baṁtamāḍĕno

(||āna||)
niṁḍum̐gaḽaladoḍuda nivvĕragainām̐ḍavu
aṁḍanĕvvadainā marmā laṁṭadu gadā
daṁḍigā śhrīveṁkaḍeśha taga nannu nelidivi
saṁḍibĕṭṭi yĕvvadainā sārĕgu bodhiṁchĕno