ఆనతియ్యవయ్య నాకు నందముగ వినేఁగాని
(॥పల్లవి॥)
ఆనతియ్యవయ్య నాకు నందముగ వినేఁగాని
నానదుగదా నవ్వితే ననుపు గావలెను
(॥ఆన॥)
ఆసపడి నాయింటికి నటు సారెఁ బిలువఁగ
వేసట గాదుగదా వింతలై నీకు
వాసితో నీతొడ యెక్కి వలపులు చల్లఁగాను
దోసము గాదుగదా తొడిఁబడ విపుడు
(॥ఆన॥)
వొగ్గి యందరిలో నిన్ను నొడివట్టి పెనఁగఁగా
సిగ్గులు గావుగదా చేకొని నీకు
అగ్గమై చన్నులుదాఁక నండ నేఁ గూచుండితేను
యెగ్గయి తోఁచదుగదా ఇప్పుడు నీకు
(॥ఆన॥)
పలుమారు నే నీకు పాదము లొత్తఁగాను
అలయిక గాదుగదా అంతలో నీకు
యెలమి శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
కలసితి మొగచాటు గాదుగదా నీకు
(||pallavi||)
ānadiyyavayya nāgu naṁdamuga vinem̐gāni
nānadugadā navvide nanubu gāvalĕnu
(||āna||)
āsabaḍi nāyiṁṭigi naḍu sārĕm̐ biluvam̐ga
vesaḍa gādugadā viṁtalai nīgu
vāsido nīdŏḍa yĕkki valabulu sallam̐gānu
dosamu gādugadā tŏḍim̐baḍa vibuḍu
(||āna||)
vŏggi yaṁdarilo ninnu nŏḍivaṭṭi pĕnam̐gam̐gā
siggulu gāvugadā segŏni nīgu
aggamai sannuludām̐ka naṁḍa nem̐ gūsuṁḍidenu
yĕggayi tom̐sadugadā ippuḍu nīgu
(||āna||)
palumāru ne nīgu pādamu lŏttam̐gānu
alayiga gādugadā aṁtalo nīgu
yĕlami śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
kalasidi mŏgasāḍu gādugadā nīgu