Aanadiyyavayya adela daamsevu

ఆనతియ్యవయ్య అదేల దాఁచేవు
Language

(॥పల్లవి॥)
ఆనతియ్యవయ్య అదేల దాఁచేవు
యీ నేర్పు లేకుండితే నింత సేతువా

(॥॥)
చెక్కులు నొక్కుచు సేదలు దేరిచి
పెక్కు ప్రియాలు చెప్పేవు నాకు
యెక్కడ నెవ్వత నెనసి వచ్చితో
యిక్కువ నూరకే యింత సేతువా

(॥॥)
కన్నుల మొక్కుచు కందువ సం
యెన్నేసివేసాలు పన్నే విందు
కన్నె నెవ్వతె నిక్కడకుఁ దెచ్చితివొ
యెన్నఁడైన నీవు యింత సేతువా

(॥॥)
వావులు చెప్పుచు వరుసఁ గూడేవు
శ్రీవేంకటగిరి గోవిందుఁడా
దేవుళ్ళ నెందరిఁ దీపులఁ బెట్టితో
యీవేళ నన్నేలి యింత సేతువా

(||pallavi||)
ānadiyyavayya adela dām̐sevu
yī nerbu leguṁḍide niṁta seduvā

(||||)
sĕkkulu nŏkkusu sedalu derisi
pĕkku priyālu sĕppevu nāgu
yĕkkaḍa nĕvvada nĕnasi vachchido
yikkuva nūrage yiṁta seduvā

(||||)
kannula mŏkkusu kaṁduva saṁ
yĕnnesivesālu panne viṁdu
kannĕ nĕvvadĕ nikkaḍagum̐ dĕchchidivŏ
yĕnnam̐ḍaina nīvu yiṁta seduvā

(||||)
vāvulu sĕppusu varusam̐ gūḍevu
śhrīveṁkaḍagiri goviṁdum̐ḍā
devuḽḽa nĕṁdarim̐ dībulam̐ bĕṭṭido
yīveḽa nanneli yiṁta seduvā