Aanadiyyavale naagu nadige nidivo ninnu

ఆనతియ్యవలె నాకు నడిగే నిదివో నిన్ను
Language

(॥పల్లవి॥)
ఆనతియ్యవలె నాకు నడిగే నిదివో నిన్ను
వూనిన వలపు నాకు నుంకువ లిచ్చితివా

(॥ఆన॥)
ప్రియములు నీవు చెప్పినయట్టయ్యీఁగాని
నయగారినీచేఁతలు నమ్ముదునా
దయదలఁచితే నిన్నుఁదగిలి మెచ్చేఁగాని
నియతపునీగుణాలు నే నెరిఁగేదాననా

(॥ఆన॥)
దినదినకొత్తలెల్లాఁ దెలుసుకొనేఁగాని
యెనసిన నీపొందిక నియ్యకొందునా
చనవున మోవిచ్చేవు చవులుచూచేఁగాని
ఘనమైన నీమా టతికడచేటిదాననా

(॥ఆన॥)
సరసములాడేవి సమ్మతులయ్యీఁగాని
పురిగొన్ననీనేరుపు పొగడుదునా
యిరవై శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
గరిమ నన్నేలితివి కడు సంతోసింతునా

(||pallavi||)
ānadiyyavalĕ nāgu naḍige nidivo ninnu
vūnina valabu nāgu nuṁkuva lichchidivā

(||āna||)
priyamulu nīvu sĕppinayaṭṭayyīm̐gāni
nayagārinīsem̐talu nammudunā
dayadalam̐side ninnum̐dagili mĕchchem̐gāni
niyadabunīguṇālu ne nĕrim̐gedānanā

(||āna||)
dinadinagŏttalĕllām̐ dĕlusugŏnem̐gāni
yĕnasina nībŏṁdiga niyyagŏṁdunā
sanavuna movichchevu savulusūsem̐gāni
ghanamaina nīmā ṭadigaḍaseḍidānanā

(||āna||)
sarasamulāḍevi sammadulayyīm̐gāni
purigŏnnanīnerubu pŏgaḍudunā
yiravai śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
garima nannelidivi kaḍu saṁtosiṁtunā