Aanadiyyamgadave adiyu maa samtosame

ఆనతియ్యఁగదవే అదియు మా సంతోసమే
Language

(॥పల్లవి॥)
ఆనతియ్యఁగదవే అదియు మా సంతోసమే
పూచిన సిగ్గుల నింత పొరలఁగ నేఁటికే

(॥ఆన॥)
చెలరేఁగిచెలరేఁగి చెలులతో మాటాడేవు
మలసియాతఁడు నిన్ను మన్నించెనటే
సెలవులనే నవ్వులుచిమ్మిరేఁగి వున్నవి
అలమి అన్నిటా నిన్ను నాదరించెనా

(॥ఆన॥)
భావించిభావించి యట్టె పాటలెల్లాఁ బాడేవు
సేవలకు మెచ్చాతఁడు చెక్కు నొక్కెనా
కావిరి వేడుకలనుఁ గడునుబ్బీ నీమేను
మోవియిచ్చి యాతఁడు నీమోహము చేకొనెనా

(॥ఆన॥)
చొక్కిచొక్కి తమకాన సొరిదిఁ బులకించేవు
యెక్కువ శ్రీవేంకటేశుఁడిట్టె కూడెనా
పుక్కిటివిడెముతోడఁ బొదలుచు మురిసేవు
చక్కనియీతఁ డింతేసి చన విచ్చెనా

(||pallavi||)
ānadiyyam̐gadave adiyu mā saṁtosame
pūsina siggula niṁta pŏralam̐ga nem̐ṭige

(||āna||)
sĕlarem̐gisĕlarem̐gi sĕlulado māḍāḍevu
malasiyādam̐ḍu ninnu manniṁchĕnaḍe
sĕlavulane navvulusimmirem̐gi vunnavi
alami anniḍā ninnu nādariṁchĕnā

(||āna||)
bhāviṁchibhāviṁchi yaṭṭĕ pāḍalĕllām̐ bāḍevu
sevalagu mĕchchādam̐ḍu sĕkku nŏkkĕnā
kāviri veḍugalanum̐ gaḍunubbī nīmenu
moviyichchi yādam̐ḍu nīmohamu segŏnĕnā

(||āna||)
sŏkkisŏkki tamagāna sŏridim̐ bulagiṁchevu
yĕkkuva śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ kūḍĕnā
pukkiḍiviḍĕmudoḍam̐ bŏdalusu murisevu
sakkaniyīdam̐ ḍiṁtesi sana vichchĕnā