Aanadiyyamgadavayya aagadaneegada neegu

ఆనతియ్యఁగదవయ్య ఆకడనీకడ నీకు
Language

(॥పల్లవి॥)
ఆనతియ్యఁగదవయ్య ఆకడనీకడ నీకు
తానకపుఁగానుకలు దక్కెనో దక్కదో

(॥ఆన॥)
మోవితేనెబోనాలు మోసునవ్వుమోనాలు
ఆవలఁ జెలి యొకతె అంపె నీకదే
కావికంటికుంకుమలు కమ్మవూర్పుసురటులు
యీవలనీ కంపితిని యెక్కెనో యెక్కదో

(॥ఆన॥)
చేసన్నవీడేలు చిమ్ముగోరి మేడేలు
పోసరించి వేరొకతె పుత్తెంచె నీకు
యీసుఁజెమటపన్నీరు యింపుగాఁకలరతులు
వాసికి నే నంపితిని వచ్చెనో రాదో

(॥ఆన॥)
పలుకులకప్పురాలు భావరతిచప్పరాలు
యెలమి శ్రీవేంకటేశ యిచ్చె నెవ్వతో
బలుసరసపు మొక్కుపాన్పుపై కూటమిచొక్కు
తలఁగక నీ కిచ్చితి తని సెనో తనియదో

(||pallavi||)
ānadiyyam̐gadavayya āgaḍanīgaḍa nīgu
tānagabum̐gānugalu dakkĕno dakkado

(||āna||)
movidenĕbonālu mosunavvumonālu
āvalam̐ jĕli yŏgadĕ aṁpĕ nīgade
kāvigaṁṭiguṁkumalu kammavūrbusuraḍulu
yīvalanī kaṁpidini yĕkkĕno yĕkkado

(||āna||)
sesannavīḍelu simmugori meḍelu
posariṁchi verŏgadĕ puttĕṁchĕ nīgu
yīsum̐jĕmaḍabannīru yiṁpugām̐kalaradulu
vāsigi ne naṁpidini vachchĕno rādo

(||āna||)
palugulagappurālu bhāvaradisapparālu
yĕlami śhrīveṁkaḍeśha yichchĕ nĕvvado
balusarasabu mŏkkubānpubai kūḍamisŏkku
talam̐gaga nī kichchidi tani sĕno taniyado