ఆనతిచ్చేవు నాతోను ఆపెమీఁది మోహమున
(॥పల్లవి॥)
ఆనతిచ్చేవు నాతోను ఆపెమీఁది మోహమున
కానీవయ్య తన సిగ్గు కాముకుఁ డెరుఁగునా
(॥ఆన॥)
యితవరి యయినసతి యేమాఁటలాడినాను
తతితో మగని కవి తలఁపులౌను
రతివేళ నెటువలె రాజసము చూపినాను
కతలుఁ గారణములై కడువేడు కౌను
(॥ఆన॥)
చుట్టమైనకాంత యంత సొలసి చూచినాను
దట్టమై విభుని కవె తలఁపులౌను
ముట్టి చెనకేటివేళ మొనగో రెంతమోసినా
గట్టిగా మేన మదనకళలెల్ల రేఁచును
(॥ఆన॥)
తగువైనవనిత యెంత గుబ్బల నొత్తినాను
తగుమర్మములు సోఁకి తలఁపులౌను
నిగిడి శ్రీవేంకటేశ నేఁడు నన్ను నేలితివి
తగిలి యనియు నీవీఁ దారుకాణలౌను
(||pallavi||)
ānadichchevu nādonu ābĕmīm̐di mohamuna
kānīvayya tana siggu kāmugum̐ ḍĕrum̐gunā
(||āna||)
yidavari yayinasadi yemām̐ṭalāḍinānu
tadido magani kavi talam̐pulaunu
radiveḽa nĕḍuvalĕ rājasamu sūbinānu
kadalum̐ gāraṇamulai kaḍuveḍu kaunu
(||āna||)
suṭṭamainagāṁta yaṁta sŏlasi sūsinānu
daṭṭamai vibhuni kavĕ talam̐pulaunu
muṭṭi sĕnageḍiveḽa mŏnago rĕṁtamosinā
gaṭṭigā mena madanagaḽalĕlla rem̐sunu
(||āna||)
taguvainavanida yĕṁta gubbala nŏttinānu
tagumarmamulu som̐ki talam̐pulaunu
nigiḍi śhrīveṁkaḍeśha nem̐ḍu nannu nelidivi
tagili yaniyu nīvīm̐ dārugāṇalaunu