ఆనతీయవయ్య నాకు నట్టే వొక్కమనసుగా
(॥పల్లవి॥)
ఆనతీయవయ్య నాకు నట్టే వొక్కమనసుగా
మోనముతోడుత నీకు మొక్కేఁగాని
(॥॥)
చెంతల మాటాడుమంటా చేవట్టి వేఁడుకొనేవు
పంతము నీకు వచ్చెనా పలికేఁ గాని
సంతతపు నీచేఁతలు సమ్మతించఁ జేసేవు
యింత నీకుఁ బ్రియమా ఇయ్యకొనేఁ గాని
(॥॥)
వొంటి నన్ను గిలిగించి వూరకైనాఁ బెనగేవు
నంటున నీకు సెలవా నవ్వేఁ గాని
గొంటరితనాన మేని గురుతులు చూపేవు
సొంటులు నీకు నింపా చూచేఁ గాని
(॥॥)
పయి జేయివేసి నన్ను బలిమిసేయ వచ్చేవు
ప్రియమా నీపై సేసవెట్టేఁ గాని
దయతో శ్రీవేంకటేశ తగిలి నన్నేలితివి
నియతాన నీకు మెచ్చా నెలకొనేఁ గాని
(||pallavi||)
ānadīyavayya nāgu naṭṭe vŏkkamanasugā
monamudoḍuda nīgu mŏkkem̐gāni
(||||)
sĕṁtala māḍāḍumaṁṭā sevaṭṭi vem̐ḍugŏnevu
paṁtamu nīgu vachchĕnā paligem̐ gāni
saṁtadabu nīsem̐talu sammadiṁcham̐ jesevu
yiṁta nīgum̐ briyamā iyyagŏnem̐ gāni
(||||)
vŏṁṭi nannu giligiṁchi vūragainām̐ bĕnagevu
naṁṭuna nīgu sĕlavā navvem̐ gāni
gŏṁṭaridanāna meni gurudulu sūbevu
sŏṁṭulu nīgu niṁpā sūsem̐ gāni
(||||)
payi jeyivesi nannu balimiseya vachchevu
priyamā nībai sesavĕṭṭem̐ gāni
dayado śhrīveṁkaḍeśha tagili nannelidivi
niyadāna nīgu mĕchchā nĕlagŏnem̐ gāni