Aanadeevayyaa neevu aagegu vinnavimchemu

ఆనతీవయ్యా నీవు ఆకెకు విన్నవించేము
Language

(॥పల్లవి॥)
ఆనతీవయ్యా నీవు ఆకెకు విన్నవించేము
నాని నాని వలపులు నాఁటుకొనెనా

(॥ఆన॥)
సొలసి సొలసి నీకు సుద్దులెల్లాఁ జెప్ప పంపీ
చెలియమాఁటలు నేఁడు చెవిఁ బట్టెనా
యెలమి నెదురుచూచి యెప్పుడు వత్తువో యంటా
తలఁపులోపల నీకు దయవుట్టెనా

(॥ఆన॥)
బడిబడిఁ దనరూపు పటమున వ్రాసి పంపీ
జడియ నీవలవులు సరివచ్చెనా
అడిల మంపఁగాను యాసపడి వున్నది
యెడయ కాపెకదకు నేతెంచేవా

(॥ఆన॥)
వినయాన నీకు నుంటవింట గప్పుర మంపీ
తనిసి నీ కింతట సంతన మాయనా
యెనసితిని శ్రీ వేంకటేశ యీ కెలమేల్మంగ
చెనకీ నిన్నియును నీచిత్తము వచ్చెనా

(||pallavi||)
ānadīvayyā nīvu āgĕgu vinnaviṁchemu
nāni nāni valabulu nām̐ṭugŏnĕnā

(||āna||)
sŏlasi sŏlasi nīgu suddulĕllām̐ jĕppa paṁpī
sĕliyamām̐ṭalu nem̐ḍu sĕvim̐ baṭṭĕnā
yĕlami nĕdurusūsi yĕppuḍu vattuvo yaṁṭā
talam̐pulobala nīgu dayavuṭṭĕnā

(||āna||)
baḍibaḍim̐ danarūbu paḍamuna vrāsi paṁpī
jaḍiya nīvalavulu sarivachchĕnā
aḍila maṁpam̐gānu yāsabaḍi vunnadi
yĕḍaya kābĕgadagu nedĕṁchevā

(||āna||)
vinayāna nīgu nuṁṭaviṁṭa gappura maṁpī
tanisi nī kiṁtaḍa saṁtana māyanā
yĕnasidini śhrī veṁkaḍeśha yī kĕlamelmaṁga
sĕnagī ninniyunu nīsittamu vachchĕnā