Aanadeevayyaa nee mohabu devula suddulu

ఆనతీవయ్యా నీ మోహపు దేవుల సుద్దులు
Language

(॥పల్లవి॥)
ఆనతీవయ్యా నీ మోహపు దేవుల సుద్దులు
వీనులార వినేము వేడుకయ్యీ మాకు

(॥ఆన॥)
సొలసిసొలసి యాపె సుద్దులు చెప్పుతానుండె
యెలమితో నిందాఁకా నేఁటికోకాని
మొలకనవ్వులతోడ మోము చూపుతానుండె
పలుమారు నది యెంతపనికోకాని

(॥ఆన॥)
చెంతఁ జెక్కుచేతితోడ సిగ్గువడుతానుండె
పంతమున నది యేమిభావమోకాని
సంతోసాన మెచ్చిమెచ్చి సరసమాడుతానుండె
వింతలేక నీతో నెంతవేడుకోకాని

(॥ఆన॥)
కమ్మరఁగమ్మర నిన్నుఁ గాఁగిలించుకొంటానుండె
చిమ్మినేఁటిరహస్యపుచేఁతలో కాని
పమ్మియలమేలుమంగపతివి శ్రీవేంకటేశ
కమ్ముక నన్నేలితి వాకతలేవోకాని

(||pallavi||)
ānadīvayyā nī mohabu devula suddulu
vīnulāra vinemu veḍugayyī māgu

(||āna||)
sŏlasisŏlasi yābĕ suddulu sĕppudānuṁḍĕ
yĕlamido niṁdām̐kā nem̐ṭigogāni
mŏlaganavvuladoḍa momu sūbudānuṁḍĕ
palumāru nadi yĕṁtabanigogāni

(||āna||)
sĕṁtam̐ jĕkkusedidoḍa sigguvaḍudānuṁḍĕ
paṁtamuna nadi yemibhāvamogāni
saṁtosāna mĕchchimĕchchi sarasamāḍudānuṁḍĕ
viṁtalega nīdo nĕṁtaveḍugogāni

(||āna||)
kammaram̐gammara ninnum̐ gām̐giliṁchugŏṁṭānuṁḍĕ
simminem̐ṭirahasyabusem̐talo kāni
pammiyalamelumaṁgabadivi śhrīveṁkaḍeśha
kammuga nannelidi vāgadalevogāni