Aanadeevayyaa naagu nadi vinavedugayyee

ఆనతీవయ్యా నాకు నది వినవేడుకయ్యీ
Language

(॥పల్లవి॥)
ఆనతీవయ్యా నాకు నది వినవేడుకయ్యీ
సోనగాఁ గురిసీ నీమై సొరదిఁ బెంజెమట

(॥॥)
పొట్టం బొరుగున నీవు పొందులు సేసేయందుకు
నెట్టన నే నవ్వినదే నెపమాయను
ఇట్టె గుట్టుననుండితే నేమనఁ గలవాఁడవు
వుట్టిపడీ వలపులవుద్యేగాలెల్లను

(॥॥)
సిరులనాపై నీవు సేసలు వెట్టేయందుకు
సరసము నేనాడుటే సందాయను
తెరలో నుండితే నెట్టు ద్రిష్టించఁ గలవాఁడవు
పెరిగీని యడియాసప్రియము లన్నియును

(॥॥)
మలయుచు నీవు నన్ను మన్నించేయందుకు
సొలసి నేఁ గూడినదే చొప్పాయను
తలవంచితే నెవ్వరిఁ దడవఁ గలవాఁడవు
మొలచీ శ్రీ వేంకటేశ మోహనములెల్లను

(||pallavi||)
ānadīvayyā nāgu nadi vinaveḍugayyī
sonagām̐ gurisī nīmai sŏradim̐ bĕṁjĕmaḍa

(||||)
pŏṭṭaṁ bŏruguna nīvu pŏṁdulu seseyaṁdugu
nĕṭṭana ne navvinade nĕbamāyanu
iṭṭĕ guṭṭunanuṁḍide nemanam̐ galavām̐ḍavu
vuṭṭibaḍī valabulavudyegālĕllanu

(||||)
sirulanābai nīvu sesalu vĕṭṭeyaṁdugu
sarasamu nenāḍuḍe saṁdāyanu
tĕralo nuṁḍide nĕṭṭu driṣhṭiṁcham̐ galavām̐ḍavu
pĕrigīni yaḍiyāsapriyamu lanniyunu

(||||)
malayusu nīvu nannu manniṁcheyaṁdugu
sŏlasi nem̐ gūḍinade sŏppāyanu
talavaṁchide nĕvvarim̐ daḍavam̐ galavām̐ḍavu
mŏlasī śhrī veṁkaḍeśha mohanamulĕllanu