ఆనతీవయ్య యేమిటా నడ్డము లేదు నేఁడు
(॥పల్లవి॥)
ఆనతీవయ్య యేమిటా నడ్డము లేదు నేఁడు
నేను నీకీ వూడిగాలు నేరుచుకొనేను
(॥ఆన॥)
కొంత గొంత నీ నిలువుఁ గొప్పు జారివున్నదిదె
పంతమున నెవ్వతైనాఁ బట్టి తీసెనో
పొంతనె యెదుగాను నీ పుక్కిటఁ దమ్మ వున్నది
అంతరంగమైనచోట నాదాయము వచ్చెనో
(॥ఆన॥)
తొలుతే నీ పచ్చడము తొప్పఁ దోఁగి వున్న దిదె
నిలుచుండఁగా నాపె పన్నీరు చల్లెనో
అలసి బుసకొట్టేవు అక్కడివారు నిన్ను
బలిమిఁ జెప్పఁ గారానిపనులు సేయించిరో
(॥ఆన॥)
యీ రీతిఁ బూవుల దండ లిన్ని నీమెడ నున్నవి
పోరానివారే నీకు బూజ సేసిరో
చేరి యలమేల్మంగను శ్రీ వేంకటేశ కూడితి
వారసి బుద్ది చెప్పిరో అందరూనుఁ దగరు
(||pallavi||)
ānadīvayya yemiḍā naḍḍamu ledu nem̐ḍu
nenu nīgī vūḍigālu nerusugŏnenu
(||āna||)
kŏṁta gŏṁta nī niluvum̐ gŏppu jārivunnadidĕ
paṁtamuna nĕvvadainām̐ baṭṭi tīsĕno
pŏṁtanĕ yĕdugānu nī pukkiḍam̐ damma vunnadi
aṁtaraṁgamainasoḍa nādāyamu vachchĕno
(||āna||)
tŏlude nī pachchaḍamu tŏppam̐ dom̐gi vunna didĕ
nilusuṁḍam̐gā nābĕ pannīru sallĕno
alasi busagŏṭṭevu akkaḍivāru ninnu
balimim̐ jĕppam̐ gārānibanulu seyiṁchiro
(||āna||)
yī rīdim̐ būvula daṁḍa linni nīmĕḍa nunnavi
porānivāre nīgu būja sesiro
seri yalamelmaṁganu śhrī veṁkaḍeśha kūḍidi
vārasi buddi sĕppiro aṁdarūnum̐ dagaru