Aanadeevayya anumaanimchaga

ఆనతీవయ్య అనుమానించక
Language

(॥పల్లవి॥)
ఆనతీవయ్య అనుమానించక
దానికేమి యింకఁ దప్పుగాదు

(॥ఆన॥)
రవ్వలుసేసిటు రావైతివి నిన్న
నవ్వులు నవ్వఁగ నమ్మితిని
యెవ్వరో చెప్పఁగ నీడ నున్నాఁడవు
చివ్వన వలపులు చే చిక్కీనా

(॥ఆన॥)
అగడుగ నాకెఅండనే వుంటివి
మొగము చూడఁగా మొక్కితిని
వెగటుదీరఁగ వీడెమిచ్చేవీడ
తగవుతో దయదలఁచితివా

(॥ఆన॥)
దీ(ధీ?)రత వెంటనే తెచ్చితి వొకతెనుఁ
గోరి మన్నించఁగఁ గూడితిని
యీరీతి శ్రీవేంకటేశ చొక్కితి విందు
యేరా చనవెల్లా నిచ్చితివా

(||pallavi||)
ānadīvayya anumāniṁchaga
dānigemi yiṁkam̐ dappugādu

(||āna||)
ravvalusesiḍu rāvaidivi ninna
navvulu navvam̐ga nammidini
yĕvvaro sĕppam̐ga nīḍa nunnām̐ḍavu
sivvana valabulu se sikkīnā

(||āna||)
agaḍuga nāgĕaṁḍane vuṁṭivi
mŏgamu sūḍam̐gā mŏkkidini
vĕgaḍudīram̐ga vīḍĕmichchevīḍa
tagavudo dayadalam̐sidivā

(||āna||)
dī(dhī?)rada vĕṁṭane tĕchchidi vŏgadĕnum̐
gori manniṁcham̐gam̐ gūḍidini
yīrīdi śhrīveṁkaḍeśha sŏkkidi viṁdu
yerā sanavĕllā nichchidivā