ఆన వెట్టుకొందునటే అటని నేను
(॥పల్లవి॥)
ఆన వెట్టుకొందునటే అటని నేను
తానే లోఁగీఁ గాక నేనిందరివంటి దాననా
(॥॥)
కడనేల వున్నవాఁడు కాఁగిటికి రమ్మనవే
చిడుముడి నన్నుఁ గంటే సిగ్గు వచ్చెనా
పొడిఁబడఁ గావచ్చీనా పోయిన పనులు నేడు
తడవ నే యిల్లాలఁ దప్పులు వట్టేనా
(॥॥)
వెఱగేల పడీఁ దాను వీడె మందుకొమ్మనవే
యెఱుకప్పుడు లేనిది ఇప్పుడేఁటికే
మఱచి సేసిన బాస మరి తలఁచుకొనీనా
గిఱిగొన తనుదానఁ గినియ వచ్చేనా
(॥॥)
తల వంచీనేల తాను తగిలి కూడుమనవే
మొలచి నాపై బత్తి మోసువారెనా
కలసి శ్రీవేంకట ఘనుఁడింక విడిచీనా
అలుగ నే పట్టవు దేవులనై దూరేనా
(||pallavi||)
āna vĕṭṭugŏṁdunaḍe aḍani nenu
tāne lom̐gīm̐ gāga neniṁdarivaṁṭi dānanā
(||||)
kaḍanela vunnavām̐ḍu kām̐giḍigi rammanave
siḍumuḍi nannum̐ gaṁṭe siggu vachchĕnā
pŏḍim̐baḍam̐ gāvachchīnā poyina panulu neḍu
taḍava ne yillālam̐ dappulu vaṭṭenā
(||||)
vĕṟagela paḍīm̐ dānu vīḍĕ maṁdugŏmmanave
yĕṟugappuḍu lenidi ippuḍem̐ṭige
maṟasi sesina bāsa mari talam̐sugŏnīnā
giṟigŏna tanudānam̐ giniya vachchenā
(||||)
tala vaṁchīnela tānu tagili kūḍumanave
mŏlasi nābai batti mosuvārĕnā
kalasi śhrīveṁkaḍa ghanum̐ḍiṁka viḍisīnā
aluga ne paṭṭavu devulanai dūrenā