Aana vettinaa maanaru appadi meeru

ఆన వెట్టినా మానరు అప్పటి మీరు
Language

(॥పల్లవి॥)
ఆన వెట్టినా మానరు అప్పటి మీరు
పానిపట్టి చెలులార పగదాన నటరే

(॥ఆన॥)
యెదురుమాటలు నేర యెవ్వరితో నేఁ బోర
వొదిగి వొకరీతి న న్నుండ నీరే
అదన నండఁ గూచుండ నాతని సరివారమా
పొదిగి నా కేల మీరు బుద్ది చెప్పేరే

(॥ఆన॥)
వట్టి పూడిగాల కోప వాదు లాతనిపై మోప
వెట్టికి మొక్కి నన్నేల వెఱ్ఱిఁ జేసేరే
యిట్టె నన్నాతఁ డే మన్నా నే మాయ లే దంటా
నొట్టు వెట్టుకొనె నంటా నొడఁబరచకురే

(॥ఆన॥)
మంతనా లంతే నెఱఁగ మతిఁ దనకు మొఱఁగ
యెం తయినఁ దనకాఁగి లేల మానేనే
యొంతలోనే శ్రీవెంకటేశుఁడు దానె కూడె
పొంత నన్ను నాతనిఁ బొగడ నేమిటికే

(||pallavi||)
āna vĕṭṭinā mānaru appaḍi mīru
pānibaṭṭi sĕlulāra pagadāna naḍare

(||āna||)
yĕdurumāḍalu nera yĕvvarido nem̐ bora
vŏdigi vŏgarīdi na nnuṁḍa nīre
adana naṁḍam̐ gūsuṁḍa nādani sarivāramā
pŏdigi nā kela mīru buddi sĕppere

(||āna||)
vaṭṭi pūḍigāla koba vādu lādanibai moba
vĕṭṭigi mŏkki nannela vĕṭrim̐ jesere
yiṭṭĕ nannādam̐ ḍe mannā ne māya le daṁṭā
nŏṭṭu vĕṭṭugŏnĕ naṁṭā nŏḍam̐barasagure

(||āna||)
maṁtanā laṁte nĕṟam̐ga madim̐ danagu mŏṟam̐ga
yĕṁ tayinam̐ danagām̐gi lela mānene
yŏṁtalone śhrīvĕṁkaḍeśhum̐ḍu dānĕ kūḍĕ
pŏṁta nannu nādanim̐ bŏgaḍa nemiḍige