ఆన తియ్యవయ్యా నిన్ను నడిగేము చెలులము
(॥పల్లవి॥)
ఆన తియ్యవయ్యా నిన్ను నడిగేము చెలులము
ఆనుక నీ చేఁతలకు నరుదయ్యీ నా(మా?)కు
(॥ఆన॥)
వలపు నీకుఁ గలదో వట్టి వినోదములో
చెలయకుఁ బ్రియములు చెప్పేవు నీవు
కలగంటివో కాక కార్యవసమునకో
యొలమి నీయంతనే యింటికి వచ్చితివి
(॥ఆన॥)
చవి నీ వెరుఁగుదువో సంగడి నేస్తాలకో
వువిదమో విమ్మని నోరూ రేవు నీవు
యివల నీయెమ్మెలో యెలయించేజాడలో
నవకపు సెలవుల నవ్వేవు సారెకు
(॥ఆన॥)
చుట్టరికము చూపేవో జూటుఁదన మిదియో
గట్టిగాఁ గాఁగిలించేవు కాంతను నీవు
యిట్టే శ్రీ వేంకటేశ యేలితి విదేమి గొత్తో
నెట్టిన నురముమీదఁ బెట్టుకొంటి విపుడు
(||pallavi||)
āna tiyyavayyā ninnu naḍigemu sĕlulamu
ānuga nī sem̐talagu narudayyī nā(mā?)ku
(||āna||)
valabu nīgum̐ galado vaṭṭi vinodamulo
sĕlayagum̐ briyamulu sĕppevu nīvu
kalagaṁṭivo kāga kāryavasamunago
yŏlami nīyaṁtane yiṁṭigi vachchidivi
(||āna||)
savi nī vĕrum̐guduvo saṁgaḍi nestālago
vuvidamo vimmani norū revu nīvu
yivala nīyĕmmĕlo yĕlayiṁchejāḍalo
navagabu sĕlavula navvevu sārĕgu
(||āna||)
suṭṭarigamu sūbevo jūḍum̐dana midiyo
gaṭṭigām̐ gām̐giliṁchevu kāṁtanu nīvu
yiṭṭe śhrī veṁkaḍeśha yelidi videmi gŏtto
nĕṭṭina nuramumīdam̐ bĕṭṭugŏṁṭi vibuḍu