Aana summee neegunu prahlaadavaradaa | ninnu

ఆన సుమ్మీ నీకును ప్రహ్లాదవరదా । నిన్ను
Language

(॥పల్లవి॥)
ఆన సుమ్మీ నీకును ప్రహ్లాదవరదా । నిన్ను-
నానితిఁ గుచముల ప్రహ్లాదవరదా

(॥ఆన॥)
అలుక మానుమీ ప్రహ్లాదవరదా నిన్ను-
నలమితి నిప్పుడే ప్రహ్లాదవరదా
అలసితి రతుల ప్రహ్లాదవరదా నీకు-
నలవాటే ఇన్నియుఁ బ్రహ్లాదవరదా

(॥ఆన॥)
అంగపుఁ జెమటల ప్రహ్లాదవరద నీకు-
నంగడి మొక్కు మొక్కేఁ బ్రహ్లాదవరదా
అంగదెల్లాఁ బాసెను ప్రహ్లాదవరదా మోవి-
నంగజముద్ర లంటెఁ బ్రహ్లాదవరదా

(॥ఆన॥)
ఆరితేరెఁ బనులు ప్రహ్లాదవరదా యింక-
నారీతి మన్నించుమీ ప్రహ్లా దవరదా
యీరీతి శ్రీవేంకటాద్రి నిందునందుఁ గూడఁగాను
హారములు పెనఁగెఁ బ్రహ్లాదవరదా

(||pallavi||)
āna summī nīgunu prahlādavaradā | ninnu-
nānidim̐ gusamula prahlādavaradā

(||āna||)
aluga mānumī prahlādavaradā ninnu-
nalamidi nippuḍe prahlādavaradā
alasidi radula prahlādavaradā nīgu-
nalavāḍe inniyum̐ brahlādavaradā

(||āna||)
aṁgabum̐ jĕmaḍala prahlādavarada nīgu-
naṁgaḍi mŏkku mŏkkem̐ brahlādavaradā
aṁgadĕllām̐ bāsĕnu prahlādavaradā movi-
naṁgajamudra laṁṭĕm̐ brahlādavaradā

(||āna||)
āriderĕm̐ banulu prahlādavaradā yiṁka-
nārīdi manniṁchumī prahlā davaradā
yīrīdi śhrīveṁkaḍādri niṁdunaṁdum̐ gūḍam̐gānu
hāramulu pĕnam̐gĕm̐ brahlādavaradā