Aana limkaam bettugone vauraa neevu

ఆన లింకాఁ బెట్టుకొనే వౌరా నీవు
Language

(॥పల్లవి॥)
ఆన లింకాఁ బెట్టుకొనే వౌరా నీవు
కానవచ్చె నీచేఁతలె కనుకోరా నీవు

(॥ఆన లింకా॥)
కొప్పుపువ్వు లవె కందె గురుతుచెమట చిందె
అప్పటినాతో బొంకే వౌరా నీవు
దప్పి దేరీఁ గెమ్మోవి తగిలెఁ గన్నులకావి
తప్పించుకొనేవు మాఁట తగురా నీవు

(॥ఆన లింకా॥)
చిటిలె గందపుఁబూఁత చెక్కు లెల్లఁ గడు రోఁత
అటమటించేవు నన్నే అవురా నీవు
నిటలాన నలకలు నిండె మేనఁ బులకలు
యిటివంటివొ ట్లేల యేమిరా నీవు

(॥ఆనలింకా॥)
ముక్కున నిట్టూర్పుగాలి మొగాన నిద్దురజోలి
అక్కడనుండె తెచ్చితి వౌరా నీవు
యిక్కడ శ్రీవెంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
మిక్కిలి జాణ వౌదువు మేలురా నీవు

(||pallavi||)
āna liṁkām̐ bĕṭṭugŏne vaurā nīvu
kānavachchĕ nīsem̐talĕ kanugorā nīvu

(||āna liṁkā||)
kŏppubuvvu lavĕ kaṁdĕ gurudusĕmaḍa siṁdĕ
appaḍinādo bŏṁke vaurā nīvu
dappi derīm̐ gĕmmovi tagilĕm̐ gannulagāvi
tappiṁchugŏnevu mām̐ṭa tagurā nīvu

(||āna liṁkā||)
siḍilĕ gaṁdabum̐būm̐ta sĕkku lĕllam̐ gaḍu rom̐ta
aḍamaḍiṁchevu nanne avurā nīvu
niḍalāna nalagalu niṁḍĕ menam̐ bulagalu
yiḍivaṁṭivŏ ṭlela yemirā nīvu

(||ānaliṁkā||)
mukkuna niṭṭūrbugāli mŏgāna niddurajoli
akkaḍanuṁḍĕ tĕchchidi vaurā nīvu
yikkaḍa śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
mikkili jāṇa vauduvu melurā nīvu