Aana lela pettugone vappadi neevu

ఆన లేల పెట్టుకొనే వప్పటి నీవు
Language

(॥పల్లవి॥)
ఆన లేల పెట్టుకొనే వప్పటి నీవు
లోని కేల తీసేవు లోకమెల్లా నుండఁగా

(॥ఆన॥)
యింటికి నే రాఁగానే యెదురు విచ్చేసితివి
యింటిలో నెవ్వతెనైనా నిడుకొంటివో
పెంటగా నిద్దరము నీ పెండ్లి చవికెలోన
వుంటిమిగా ఆడ కేల వొద్దయ్య సోదించను

(॥ఆన॥)
తప్పక నేఁ జూచితేను తలవంచుకొంటివి
తప్పు నీమీఁద నేమైనాఁ దగిలినదో
వొప్పుగ మేడ యెక్కుద మూరకే తెర దియ్యఁగ
నప్పు డేమి బయలౌనో అంతేసికి నోపను

(॥ఆన॥)
కౌఁగిట నేఁ గూడఁగనే కడు నెఱఁగందితివి
కౌఁగిటిలో నాపెరతి గంటివో నీవు
చేగదేరఁ గూడితివి శ్రీవేంకటేశ్వర యిట్టె
ఆగేవు రతుల నన్ను ఆస యంతో నీకు

(||pallavi||)
āna lela pĕṭṭugŏne vappaḍi nīvu
loni kela tīsevu logamĕllā nuṁḍam̐gā

(||āna||)
yiṁṭigi ne rām̐gāne yĕduru vichchesidivi
yiṁṭilo nĕvvadĕnainā niḍugŏṁṭivo
pĕṁṭagā niddaramu nī pĕṁḍli savigĕlona
vuṁṭimigā āḍa kela vŏddayya sodiṁchanu

(||āna||)
tappaga nem̐ jūsidenu talavaṁchugŏṁṭivi
tappu nīmīm̐da nemainām̐ dagilinado
vŏppuga meḍa yĕkkuda mūrage tĕra diyyam̐ga
nappu ḍemi bayalauno aṁtesigi nobanu

(||āna||)
kaum̐giḍa nem̐ gūḍam̐gane kaḍu nĕṟam̐gaṁdidivi
kaum̐giḍilo nābĕradi gaṁṭivo nīvu
segaderam̐ gūḍidivi śhrīveṁkaḍeśhvara yiṭṭĕ
āgevu radula nannu āsa yaṁto nīgu