Aana lela pettugone vappadi naado

ఆన లేల పెట్టుకొనే వప్పటి నాతో
Language

(॥పల్లవి॥)
ఆన లేల పెట్టుకొనే వప్పటి నాతో
దాని కేమి దోసమా తగినంతే కాక

(॥ఆన లేల॥)
చెలచేఁ బిలిపించఁగ చేర వచ్చితిని గాక
వలచి నీ యంత నీవే వచ్చితివా
వెల లేక మోహించి విడువ లేనేఁ గాక
కల నీగుణమే తొల్లి కన్నది గాదా

(॥ఆన లేల॥)
సేవలు నేఁ జేయఁగాను చిత్తము గరఁగెఁ గాక
కావించి నీ యంత నీవే కరఁగితివా
యీవల గూళ నై నేనె యిట్టె పై కొందుఁ గాక
చేవ గలంతే కాక సేసి పెట్ట వచ్చునా

(॥ఆనలేల॥)
దండ నేనే వుండఁగాను దయ దలఁచితి గాక
గుండె గరఁగి నీ యంతఁ గూడితివా
నిండి శ్రీవెంకటేశ నీకు నాకుఁ బోదు గాక
వెండియు నీతో విన్నవించ గురి యున్నదా

(||pallavi||)
āna lela pĕṭṭugŏne vappaḍi nādo
dāni kemi dosamā taginaṁte kāga

(||āna lela||)
sĕlasem̐ bilibiṁcham̐ga sera vachchidini gāga
valasi nī yaṁta nīve vachchidivā
vĕla lega mohiṁchi viḍuva lenem̐ gāga
kala nīguṇame tŏlli kannadi gādā

(||āna lela||)
sevalu nem̐ jeyam̐gānu sittamu garam̐gĕm̐ gāga
kāviṁchi nī yaṁta nīve karam̐gidivā
yīvala gūḽa nai nenĕ yiṭṭĕ pai kŏṁdum̐ gāga
seva galaṁte kāga sesi pĕṭṭa vachchunā

(||ānalela||)
daṁḍa nene vuṁḍam̐gānu daya dalam̐sidi gāga
guṁḍĕ garam̐gi nī yaṁtam̐ gūḍidivā
niṁḍi śhrīvĕṁkaḍeśha nīgu nāgum̐ bodu gāga
vĕṁḍiyu nīdo vinnaviṁcha guri yunnadā