ఆఁటది యింత కోపునా అంటిమోసువంటిది
(॥పల్లవి॥)
ఆఁటది యింత కోపునా అంటిమోసువంటిది
మాఁటలనే లాలించి మరపుకోవయ్యా
(॥ఆఁట॥)
సిగ్గరితనాన నాపై శిరసు వంచుకుండఁగా
యెగ్గుపట్టి వున్నదంటా యేల లోఁచేవు
నిగ్గుదేరఁ జేతులెత్తి నీకు నిట్టె మొక్కఁగాను
బెగ్గిలఁ గుచములేల పిసికేవయ్యా
(॥ఆఁట॥)
ముగుదతనాన నాపె మోనముతో నుండఁగాను
నగుమంటా గోరనేల నాంటించేవు
తగిలి నీపాదాలపై దానె యానవెట్టఁగాను
తెగడి కొప్పువట్టేల తీసేవయ్యా
(॥ఆట॥)
గోలతనమున నాపె గుట్టుసేసుకుంటఁగాను
చేలకొంగువట్టి యెంత చిమ్మిరేఁచేవు
యాలీల శ్రీపేంకటేశ యింతి పాదాలొత్తఁగాను
తాలిమితోఁ గూడి యెంత మేలమాడేవయ్యా
(||pallavi||)
ām̐ṭadi yiṁta kobunā aṁṭimosuvaṁṭidi
mām̐ṭalane lāliṁchi marabugovayyā
(||ām̐ṭa||)
siggaridanāna nābai śhirasu vaṁchuguṁḍam̐gā
yĕggubaṭṭi vunnadaṁṭā yela lom̐sevu
nigguderam̐ jedulĕtti nīgu niṭṭĕ mŏkkam̐gānu
bĕggilam̐ gusamulela pisigevayyā
(||ām̐ṭa||)
mugudadanāna nābĕ monamudo nuṁḍam̐gānu
nagumaṁṭā goranela nāṁṭiṁchevu
tagili nībādālabai dānĕ yānavĕṭṭam̐gānu
tĕgaḍi kŏppuvaṭṭela tīsevayyā
(||āḍa||)
goladanamuna nābĕ guṭṭusesuguṁṭam̐gānu
selagŏṁguvaṭṭi yĕṁta simmirem̐sevu
yālīla śhrībeṁkaḍeśha yiṁti pādālŏttam̐gānu
tālimidom̐ gūḍi yĕṁta melamāḍevayyā