ఆఁటది యేమి యెఱుఁగు నన్నిటను మగవాని
(॥పల్లవి॥)
ఆఁటది యేమి యెఱుఁగు నన్నిటను మగవాని-
మాఁటలోని దింతమర్మము నీచే నున్నది
(॥॥)
సేయకుండవచ్చునా చెప్పినట్టెల్లా నేను
పాయపువాఁడవు నీవు బలువుఁడవు
యేయెడాఁ జెప్పఁగరానియెన్నికలు నీరతులు
తోయరాదు పాయరాదు దోసము నీది
(॥॥)
ఆడకుండవచ్చునా అనుకున్నట్టెల్లా నీతో
కోడెకాఁడవు నీవు గొంటరివి
పాడితో నూఁకొనరానిపచ్చివి నీసుద్దులు
వాడిక నాజవ్వనము వడి నీకె సెలవు
(॥॥)
వూరకుండవచ్చునా వొడ్డారమున నీతో
ధీరుఁడవు శ్రీవేంకటాద్రినివాసుఁడ
యీరీతి మానఁగరావు యెన్నఁడు నీపొందు లివి
కేరడముగాఁదేలినకీరీతి నీది
(||pallavi||)
ām̐ṭadi yemi yĕṟum̐gu nanniḍanu magavāni-
mām̐ṭaloni diṁtamarmamu nīse nunnadi
(||||)
seyaguṁḍavachchunā sĕppinaṭṭĕllā nenu
pāyabuvām̐ḍavu nīvu baluvum̐ḍavu
yeyĕḍām̐ jĕppam̐garāniyĕnnigalu nīradulu
toyarādu pāyarādu dosamu nīdi
(||||)
āḍaguṁḍavachchunā anugunnaṭṭĕllā nīdo
koḍĕgām̐ḍavu nīvu gŏṁṭarivi
pāḍido nūm̐kŏnarānibachchivi nīsuddulu
vāḍiga nājavvanamu vaḍi nīgĕ sĕlavu
(||||)
vūraguṁḍavachchunā vŏḍḍāramuna nīdo
dhīrum̐ḍavu śhrīveṁkaḍādrinivāsum̐ḍa
yīrīdi mānam̐garāvu yĕnnam̐ḍu nībŏṁdu livi
keraḍamugām̐delinagīrīdi nīdi