ఆఁటది చేసిన మేలు అది విచారించవైతి
(॥పల్లవి॥)
ఆఁటది చేసిన మేలు అది విచారించవైతి
గాఁటానఁ బెనఁగుదురా కాతరానను
(॥ఆట॥)
సింగారించుకొని యిట్టె చెలి నీ యండకు రాఁగా
ముంగురులంటుదురా మొక్కలానను
సంగతిగా మోవి చూపి చవులు వుట్టించఁగాను
కొంగువట్టి తీతురా గొరబుగాను
(॥ఆట॥)
పుక్కిటివిడెముతోడ పొలితి నీతో నవ్వఁగా
పక్కనఁ బిసుకుదురా పాలిండ్లు
అక్కరతో నీకు విడె మందియ్యరాఁగాను
తక్కక గిలిగింతురా తత్తరానను
(॥ఆట॥)
కడు మోహమున నిన్నుఁ గాఁగిలించుకొనఁగాను
బడల నలయింతురా పచ్చదేరను
అడరి శ్రీవేంకటేశ అంగన నిన్నుఁ గూడఁగా
తడవి వేగిరింతురా దప్పిదేరను
(||pallavi||)
ām̐ṭadi sesina melu adi visāriṁchavaidi
gām̐ṭānam̐ bĕnam̐gudurā kādarānanu
(||āḍa||)
siṁgāriṁchugŏni yiṭṭĕ sĕli nī yaṁḍagu rām̐gā
muṁgurulaṁṭudurā mŏkkalānanu
saṁgadigā movi sūbi savulu vuṭṭiṁcham̐gānu
kŏṁguvaṭṭi tīdurā gŏrabugānu
(||āḍa||)
pukkiḍiviḍĕmudoḍa pŏlidi nīdo navvam̐gā
pakkanam̐ bisugudurā pāliṁḍlu
akkarado nīgu viḍĕ maṁdiyyarām̐gānu
takkaga giligiṁturā tattarānanu
(||āḍa||)
kaḍu mohamuna ninnum̐ gām̐giliṁchugŏnam̐gānu
baḍala nalayiṁturā pachchaderanu
aḍari śhrīveṁkaḍeśha aṁgana ninnum̐ gūḍam̐gā
taḍavi vegiriṁturā dappideranu