ఆఁటది రాజ్యమేలితే అది మంచిదేకాదా
(॥పల్లవి॥)
ఆఁటది రాజ్యమేలితే అది మంచిదేకాదా
చాటువగా మాకు నిన్ను సాదించనేఁటికి
(॥ఆఁట॥)
పీఁటపై నున్న దాపె ప్రియుఁడవు నిలుచుండి
మాఁటలాడే వాపెతోను మంచిదేకాదా
గాఁటముగా వంచ నెంత గలిగి మెలఁగినాను
యీటున నీవే బదే వేమినననేఁటికి
(॥ఆఁట॥)
పడఁతి పవ్వళించఁగా పాదాలకాడ నుండి
మడిచిచ్చే వాకు నీవు మంచిదేకాదా
వుడుగక నీవెంత వూడిగాలు నేర్చినాను
కడు నీకే లాభమయ్యీ కాదనఁగనేఁటికి
(॥ఆఁట॥)
వురముపై నున్న దాకెవొగి నిట్టే కిందుపడి
మరులు గొంటివి నీవు మంచిదేకాదా
ఇరవై శ్రీవేంకటేశ యెంత మోపెత్తుకొనినా
మరిగి నన్నేలితివి మచ్చరించనేఁటికి
(||pallavi||)
ām̐ṭadi rājyamelide adi maṁchidegādā
sāḍuvagā māgu ninnu sādiṁchanem̐ṭigi
(||ām̐ṭa||)
pīm̐ṭabai nunna dābĕ priyum̐ḍavu nilusuṁḍi
mām̐ṭalāḍe vābĕdonu maṁchidegādā
gām̐ṭamugā vaṁcha nĕṁta galigi mĕlam̐ginānu
yīḍuna nīve bade veminananem̐ṭigi
(||ām̐ṭa||)
paḍam̐ti pavvaḽiṁcham̐gā pādālagāḍa nuṁḍi
maḍisichche vāgu nīvu maṁchidegādā
vuḍugaga nīvĕṁta vūḍigālu nersinānu
kaḍu nīge lābhamayyī kādanam̐ganem̐ṭigi
(||ām̐ṭa||)
vuramubai nunna dāgĕvŏgi niṭṭe kiṁdubaḍi
marulu gŏṁṭivi nīvu maṁchidegādā
iravai śhrīveṁkaḍeśha yĕṁta mobĕttugŏninā
marigi nannelidivi machchariṁchanem̐ṭigi