Aamtadi maanaabadi??? yaasodagatte

ఆఁటది మానాపతి??? యాసోదకత్తె
Language

(॥పల్లవి॥)
ఆఁటది మానాపతి??? యాసోదకత్తె
మాఁటాడి మన్నించరాదా మరఁగేల నీకు

(॥ఆఁట॥)
సొలసిసొలసి సారెఁ జూచీ నాకె నిన్ను
యెలమి నల్లంతనుండి యెంతపనికో
పిలిచి యుడుగరాదా ప్రియమున బుజ్జగించి
చెలఁగి పరాకేల సేసుకవున్నాఁడవు

(॥ఆఁట॥)
సూటికిఁ జెలికి తనజుట్టలేలఁ జూపీ నిన్ను
గాటముగా నది యేమి కారణానకో
నీటుతోడఁ గొంగువట్టి నీవు దెలుపుకోరాదా
యేఁటికి మూసిదాఁచే విప్పుడు నీవు

(॥ఆఁట॥)
వరుసగా వీణెలోన వాయించి పాడీ నిన్ను
సొరిది నీకెటువంటి చుట్టమైనదో
యిరవై శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితిమి
సరి నాపెఁ గూడరాదా జాగులేల సేసేవు

(||pallavi||)
ām̐ṭadi mānābadi??? yāsodagattĕ
mām̐ṭāḍi manniṁcharādā maram̐gela nīgu

(||ām̐ṭa||)
sŏlasisŏlasi sārĕm̐ jūsī nāgĕ ninnu
yĕlami nallaṁtanuṁḍi yĕṁtabanigo
pilisi yuḍugarādā priyamuna bujjagiṁchi
sĕlam̐gi parāgela sesugavunnām̐ḍavu

(||ām̐ṭa||)
sūḍigim̐ jĕligi tanajuṭṭalelam̐ jūbī ninnu
gāḍamugā nadi yemi kāraṇānago
nīḍudoḍam̐ gŏṁguvaṭṭi nīvu dĕlubugorādā
yem̐ṭigi mūsidām̐se vippuḍu nīvu

(||ām̐ṭa||)
varusagā vīṇĕlona vāyiṁchi pāḍī ninnu
sŏridi nīgĕḍuvaṁṭi suṭṭamainado
yiravai śhrīveṁkaḍeśha yiḍu nannu nelidimi
sari nābĕm̐ gūḍarādā jāgulela sesevu