ఆఁటది కూళయిననూ మరి అడ్డపెట్టరాదు
(॥పల్లవి॥)
ఆఁటది కూళయిననూ మరి అడ్డపెట్టరాదు
చీటికి మాటికి విన్నవించనేల చెప్ప సిగ్గయ్యీని
(॥ఆఁట॥)
చలివాసి నిన్నుసారె నాయెదుట
పిలిచీనెవ్వతెరా దీనిబీరమింకేమందును
యిలు చొచ్చివచ్చి యెంగిలిరతికి
తలకొని చూచేతరుణీఁ గలదా
(॥ఆఁట॥)
మొగము చూచితే ముందుగానే నీతో
నగినదెవ్వతెరా దీనినటనలేమందును
పగలు చాటుచు పాసిన మోహము
మగవానిమీఁద మగుడించఁ దగునా
(॥ఆఁట॥)
యిట్టి నన్నుఁగూడి యెనసిననిన్నుఁ
దిట్టీనెవ్వతెరా దీనిదీమసమేమందును
వెట్టి శ్రీవేంకట వెన్నముద్ద కృష్ణ
గుట్టు విడువఁగ కొమ్మకునేల
(||pallavi||)
ām̐ṭadi kūḽayinanū mari aḍḍabĕṭṭarādu
sīḍigi māḍigi vinnaviṁchanela sĕppa siggayyīni
(||ām̐ṭa||)
salivāsi ninnusārĕ nāyĕduḍa
pilisīnĕvvadĕrā dīnibīramiṁkemaṁdunu
yilu sŏchchivachchi yĕṁgiliradigi
talagŏni sūsedaruṇīm̐ galadā
(||ām̐ṭa||)
mŏgamu sūside muṁdugāne nīdo
naginadĕvvadĕrā dīninaḍanalemaṁdunu
pagalu sāḍusu pāsina mohamu
magavānimīm̐da maguḍiṁcham̐ dagunā
(||ām̐ṭa||)
yiṭṭi nannum̐gūḍi yĕnasinaninnum̐
diṭṭīnĕvvadĕrā dīnidīmasamemaṁdunu
vĕṭṭi śhrīveṁkaḍa vĕnnamudda kṛṣhṇa
guṭṭu viḍuvam̐ga kŏmmagunela