Aamtadi gosaridenu aadarimchavalem gaaga

ఆఁటది గొసరితేను ఆదరించవలెఁ గాక
Language

(॥పల్లవి॥)
ఆఁటది గొసరితేను ఆదరించవలెఁ గాక
యేఁటి మగవాఁడ వైతి వింత నీకమరునా

(॥ఆఁట॥)
నగకుండితే నగవు ననుచనికోపాన
మొగ మియ్యకుండితేను మోము వంచేవు
జిగి నే నలిగి యేమి సేసినాఁ జెల్లుఁ గాక
యెగక్కెపవలప లివి నీకుఁ జెల్లునా

(॥ఆఁట॥)
ములుగుతా నే నుండితే ముంగిటనే వున్నాఁడవు
అలరి పలువకున్న నండకు రావు
చెలిమిబలిమిదాన సాదించ నాకుఁ దగితే
అలవోక సరిపంతా లవి నీకుఁ దగునా

(॥ఆఁట॥)
కందువ నే నంటితేను కాఁగిట నీవు నించేవు
యిందునె శ్రీ వేంకటేశ యేలితి నన్ను
మందెమేళమైన నామనసే మెత్తువు గాక
నిందల నీ గుణములు నీకు నీవే మెత్తువా

(||pallavi||)
ām̐ṭadi gŏsaridenu ādariṁchavalĕm̐ gāga
yem̐ṭi magavām̐ḍa vaidi viṁta nīgamarunā

(||ām̐ṭa||)
nagaguṁḍide nagavu nanusanigobāna
mŏga miyyaguṁḍidenu momu vaṁchevu
jigi ne naligi yemi sesinām̐ jĕllum̐ gāga
yĕgakkĕbavalaba livi nīgum̐ jĕllunā

(||ām̐ṭa||)
mulugudā ne nuṁḍide muṁgiḍane vunnām̐ḍavu
alari paluvagunna naṁḍagu rāvu
sĕlimibalimidāna sādiṁcha nāgum̐ dagide
alavoga saribaṁtā lavi nīgum̐ dagunā

(||ām̐ṭa||)
kaṁduva ne naṁṭidenu kām̐giḍa nīvu niṁchevu
yiṁdunĕ śhrī veṁkaḍeśha yelidi nannu
maṁdĕmeḽamaina nāmanase mĕttuvu gāga
niṁdala nī guṇamulu nīgu nīve mĕttuvā