Aamtadi goolayaide namdemunnadi

ఆఁటది గూళయైతే నందేమున్నది
Language

(॥పల్లవి॥)
ఆఁటది గూళయైతే నందేమున్నది
బూటకపు దిస చూపి పొత్తు గలసీనా

(॥ఆఁట॥)
నవ్వుకొంటా నీవు నేను నంటున వినోదించఁగ
పువ్వులఁ దానేల వేసీఁ బొంచి ని న్నా కె
యివ్వలఁ జెంత సరస మీఁతా వెఁతాలై యుండఁగ
దవ్వులఁ బొందులు చూపి తమి రేఁచీనా

(॥ఆఁట॥)
వెన్నెలలో నీవు నేను వేడుకతోఁ గూడి యుండఁగ
సన్నలు తానేల సేసీ సారె నీ కాపె
పన్నినరతు లీడఁ దెప్పలుఁ గుప్పలై యుండఁగ
యెన్నటిపొందులో చూపి యింపు రేఁచీనా

(॥ఆఁట॥)
బలిమి నిద్దరమును పానుపుపైఁ గూచుండఁగ
యెలుఁగె త్తేమివిలిచీ వెలి నీ న్నా పె
వలపు శ్రీవేంకటేశ వాడికై యిందు నుండఁగ
సొలపుఁ బొందులు చూపి సొంపులు రేఁచీనా

(||pallavi||)
ām̐ṭadi gūḽayaide naṁdemunnadi
būḍagabu disa sūbi pŏttu galasīnā

(||ām̐ṭa||)
navvugŏṁṭā nīvu nenu naṁṭuna vinodiṁcham̐ga
puvvulam̐ dānela vesīm̐ bŏṁchi ni nnā kĕ
yivvalam̐ jĕṁta sarasa mīm̐tā vĕm̐tālai yuṁḍam̐ga
davvulam̐ bŏṁdulu sūbi tami rem̐sīnā

(||ām̐ṭa||)
vĕnnĕlalo nīvu nenu veḍugadom̐ gūḍi yuṁḍam̐ga
sannalu tānela sesī sārĕ nī kābĕ
panninaradu līḍam̐ dĕppalum̐ guppalai yuṁḍam̐ga
yĕnnaḍibŏṁdulo sūbi yiṁpu rem̐sīnā

(||ām̐ṭa||)
balimi niddaramunu pānububaim̐ gūsuṁḍam̐ga
yĕlum̐gĕ ttemivilisī vĕli nī nnā pĕ
valabu śhrīveṁkaḍeśha vāḍigai yiṁdu nuṁḍam̐ga
sŏlabum̐ bŏṁdulu sūbi sŏṁpulu rem̐sīnā