ఆఁటది గూళయైతే నందేమి చెప్పేము నేము
(॥పల్లవి॥)
ఆఁటది గూళయైతే నందేమి చెప్పేము నేము
వాటముగ నీవైన వద్దనవద్దా
(॥ఆట॥)
వూని యేకతాన నీవొద్ద నేఁ గాచుకుండగా
కానుకె లిచ్చి తగిలీఁ గదిసి తాను
మానకు నీతో నేను మంతనములాడఁగాను
ఆనుక యెంగిలిమాట లాడనేల తాను
(॥ఆట॥)
పడతినై నే నేకు బాగాలిందియ్యఁ గాను
యెడ నాకుమడిచిచ్చీ యేఁటికిఁ దాను
జడిగొని నీతో నేను సరసములాడఁగాను
కడిగి పయ్యదకొంగు కప్పనేల తాను
(॥ఆట॥)
గద్దించి ఇంతలో నేను కాఁగిలించుకుండఁగాను
చద్దివేఁడివలపేల చల్లీఁ దాను
ఇద్దరము శ్రీవేంకటేశ పోదై కూడఁగాను
బద్దులకునేల వొడఁబరచీఁ దాను
(||pallavi||)
ām̐ṭadi gūḽayaide naṁdemi sĕppemu nemu
vāḍamuga nīvaina vaddanavaddā
(||āḍa||)
vūni yegadāna nīvŏdda nem̐ gāsuguṁḍagā
kānugĕ lichchi tagilīm̐ gadisi tānu
mānagu nīdo nenu maṁtanamulāḍam̐gānu
ānuga yĕṁgilimāḍa lāḍanela tānu
(||āḍa||)
paḍadinai ne negu bāgāliṁdiyyam̐ gānu
yĕḍa nāgumaḍisichchī yem̐ṭigim̐ dānu
jaḍigŏni nīdo nenu sarasamulāḍam̐gānu
kaḍigi payyadagŏṁgu kappanela tānu
(||āḍa||)
gaddiṁchi iṁtalo nenu kām̐giliṁchuguṁḍam̐gānu
saddivem̐ḍivalabela sallīm̐ dānu
iddaramu śhrīveṁkaḍeśha podai kūḍam̐gānu
baddulagunela vŏḍam̐barasīm̐ dānu