ఆఁటది గూళయైతే నం దేమున్నది
(॥పల్లవి॥)
ఆఁటది గూళయైతే నం దేమున్నది
చీటికి మాటికి నింత సిగ్గులు విడుతురా
(॥॥)
సవతి నంటా నాతో సణఁగులు చల్లి చల్లి
తివురుచు వచ్చి యేల తెర దీశేవే
పవళించి వున్నవాఁడు పానుపుపై రమణుఁడు
వివర మెఱఁగ కేల వేగిరించేవే
(॥॥)
వరుస నా దెంటా నీవు వట్టి రొద లెల్లాఁజేసి
పరగ నేల మంచముపైఁ గూచుండేవే
నిరతిరతి నలసి నిద్దిరింపుచున్నవాఁడు
వెర వెఱఁగక యేల వేగిరించేవే
(॥॥)
అంతలో నా యీడుదాన నంటా లోను చొచ్చి వచ్చి
కాంతుని నీ వేఁటికిఁ గౌఁగిలించేవే
చెంత మేలుకొని నన్ను శ్రీవెంకటేశుఁడు గూడె
వింతదానవై యేల వేగిరించేవే
(||pallavi||)
ām̐ṭadi gūḽayaide naṁ demunnadi
sīḍigi māḍigi niṁta siggulu viḍudurā
(||||)
savadi naṁṭā nādo saṇam̐gulu salli salli
tivurusu vachchi yela tĕra dīśheve
pavaḽiṁchi vunnavām̐ḍu pānububai ramaṇum̐ḍu
vivara mĕṟam̐ga kela vegiriṁcheve
(||||)
varusa nā dĕṁṭā nīvu vaṭṭi rŏda lĕllām̐jesi
paraga nela maṁchamubaim̐ gūsuṁḍeve
niradiradi nalasi niddiriṁpusunnavām̐ḍu
vĕra vĕṟam̐gaga yela vegiriṁcheve
(||||)
aṁtalo nā yīḍudāna naṁṭā lonu sŏchchi vachchi
kāṁtuni nī vem̐ṭigim̐ gaum̐giliṁcheve
sĕṁta melugŏni nannu śhrīvĕṁkaḍeśhum̐ḍu gūḍĕ
viṁtadānavai yela vegiriṁcheve