ఆఁటది గర్వించితేను అంతట మట్టెరఁగదు
(॥పల్లవి॥)
ఆఁటది గర్వించితేను అంతట మట్టెరఁగదు
పాటించి యాతఁడు నీకే పాలుపడె నటవే
(॥ఆట॥)
వంతుపెట్టుకొని పతివద్దఁ గాచుకుందానవు
యెంతగద్దే నీచనవు ఇందరికంటే
ఇంతలోనే చెవిలోన నేకతాలూ నాడేవు
చింతదీర నీమాటే సేసునటే యీతఁడు
(॥ఆట॥)
పరగ నాతనికి నీపచ్చడము గప్పేవు
పొరుగున నెన్నటిపొందులే నీకు
తెరవేసుకొనుచు చేతికి విడెమూ నిచ్చేవు
సిరులఁబనులు నీకుఁ జెప్పెనటే యాతఁడు
(॥ఆట॥)
కలసిమెలసి నీవు కందువలు చెప్పేవు
చెలరేఁగి నీకు బాస సేసెనటవే
యెలమి శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్నుఁ గూడె
తెలిపి నిన్నిట్లానే దిద్దెనటే యీతఁడు
(||pallavi||)
ām̐ṭadi garviṁchidenu aṁtaḍa maṭṭĕram̐gadu
pāḍiṁchi yādam̐ḍu nīge pālubaḍĕ naḍave
(||āḍa||)
vaṁtubĕṭṭugŏni padivaddam̐ gāsuguṁdānavu
yĕṁtagadde nīsanavu iṁdarigaṁṭe
iṁtalone sĕvilona negadālū nāḍevu
siṁtadīra nīmāḍe sesunaḍe yīdam̐ḍu
(||āḍa||)
paraga nādanigi nībachchaḍamu gappevu
pŏruguna nĕnnaḍibŏṁdule nīgu
tĕravesugŏnusu sedigi viḍĕmū nichchevu
sirulam̐banulu nīgum̐ jĕppĕnaḍe yādam̐ḍu
(||āḍa||)
kalasimĕlasi nīvu kaṁduvalu sĕppevu
sĕlarem̐gi nīgu bāsa sesĕnaḍave
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannum̐ gūḍĕ
tĕlibi ninniṭlāne diddĕnaḍe yīdam̐ḍu