Aamtadi badimaalide naarajagatte yamduru

ఆఁటది బతిమాలితే నారజకత్తె యందురు
Language

(॥పల్లవి॥)
ఆఁటది బతిమాలితే నారజకత్తె యందురు
యేఁటికి నన్నుఁ గొసరే విన్నిటా జాణఁడవు

(॥ఆఁట॥)
జలజాక్షి యొకతె నీ సంగడిఁ గూచుండఁగాను
సొలయక వేరొకతెకుఁ జోట్టున్నదా
కలికి యొకతె నీకుఁ గైదండ కిచ్చుకుండఁగా
చలపట్టి పెనఁగితే చప్పనగాదా

(॥ఆఁట॥)
మగువ యొకతె నీతో మాఁటలాడుచుండఁగాను
తగుల వేరొకతెకుఁ దగవయ్యీనా
మృగనేత్రి నీ కొకతె మేకొని సేవసేయఁగా
జిగిమించి నీతోనవ్వ సిగ్గుగాదా

(॥ఆఁట॥)
వనిత యొకతె నిన్ను వసము సేసుకొండఁగా
చెనక వేరొకతెకుఁ జెల్లుబడౌనా
యెనసితివి శ్రీవేంకటేశ నీవె నన్నింతలో
నిన్ను నిఁక మెచ్చేదే నేరుపుగాదా

(||pallavi||)
ām̐ṭadi badimālide nārajagattĕ yaṁduru
yem̐ṭigi nannum̐ gŏsare vinniḍā jāṇam̐ḍavu

(||ām̐ṭa||)
jalajākṣhi yŏgadĕ nī saṁgaḍim̐ gūsuṁḍam̐gānu
sŏlayaga verŏgadĕgum̐ joṭṭunnadā
kaligi yŏgadĕ nīgum̐ gaidaṁḍa kichchuguṁḍam̐gā
salabaṭṭi pĕnam̐gide sappanagādā

(||ām̐ṭa||)
maguva yŏgadĕ nīdo mām̐ṭalāḍusuṁḍam̐gānu
tagula verŏgadĕgum̐ dagavayyīnā
mṛganetri nī kŏgadĕ megŏni sevaseyam̐gā
jigimiṁchi nīdonavva siggugādā

(||ām̐ṭa||)
vanida yŏgadĕ ninnu vasamu sesugŏṁḍam̐gā
sĕnaga verŏgadĕgum̐ jĕllubaḍaunā
yĕnasidivi śhrīveṁkaḍeśha nīvĕ nanniṁtalo
ninnu nim̐ka mĕchchede nerubugādā