ఆఁటదై పుట్టినందు కటువలెఁ గాకుండితే
(॥పల్లవి॥)
ఆఁటదై పుట్టినందు కటువలెఁ గాకుండితే
యేఁటి జన్మమయ్యా మమ్ము నేలుకొన వలదా
(॥॥)
పానుపుపైఁ గూచుండి నీ పాదములు చేత నొత్తి
ఆనించి గుబ్బల మీఁద నందుకొంటాను
నానుపుఁ జెమట నీపై ననుపునఁ జిందుకొంటా
కానుకగా మోవి యిచ్చి కరఁగఁగ వలదా
(॥॥)
కొనగోర నీ కురులు కూడగీరి దువ్వి దువ్వి
చెనకి చెక్కునఁ జెక్కు చేర్చుకొంటాను
పెనఁగి నీ బుజాలపై ప్రియానఁ జేతులు వేసి
తనివార మోము చూచి దైవార వలదా
(॥॥)
వొయ్యనే కౌఁగిట నించి వొత్తగిలి పక్కనుండి
తియ్యని నీ మోవితేనె దీసుకొంటాను
ఇయ్యెడ శ్రీ వేంకటేశ ఇదే నీ దేవుల నైతి
పయ్యదఁ గప్పి ఇట్టే తెప్పలఁ దేలవలదా
(||pallavi||)
ām̐ṭadai puṭṭinaṁdu kaḍuvalĕm̐ gāguṁḍide
yem̐ṭi janmamayyā mammu nelugŏna valadā
(||||)
pānububaim̐ gūsuṁḍi nī pādamulu seda nŏtti
āniṁchi gubbala mīm̐da naṁdugŏṁṭānu
nānubum̐ jĕmaḍa nībai nanubunam̐ jiṁdugŏṁṭā
kānugagā movi yichchi karam̐gam̐ga valadā
(||||)
kŏnagora nī kurulu kūḍagīri duvvi duvvi
sĕnagi sĕkkunam̐ jĕkku sersugŏṁṭānu
pĕnam̐gi nī bujālabai priyānam̐ jedulu vesi
tanivāra momu sūsi daivāra valadā
(||||)
vŏyyane kaum̐giḍa niṁchi vŏttagili pakkanuṁḍi
tiyyani nī movidenĕ dīsugŏṁṭānu
iyyĕḍa śhrī veṁkaḍeśha ide nī devula naidi
payyadam̐ gappi iṭṭe tĕppalam̐ delavaladā