ఆఁటదానిపై నీ బలు వంతయునుఁ జూపేవా
(॥పల్లవి॥)
ఆఁటదానిపై నీ బలు వంతయునుఁ జూపేవా
నాఁటెనా నీ ఆయములు నవ్వుల నా మాటలు
(॥ఆటదాని॥)
వాలుకరెప్పలు వంచి వడిఁ దప్పక చూచేవు
వొలి నిందాఁక నేడ నుంటి వంటేను
తాలిమి లే కప్పటికి తగఁ గసరుకొనేవు
యేలని నెంజిరి వికం నెంతటాఁ దీరదురా
(॥ఆటదాని॥)
చేరి మారుమోముతోఁ బిల్చిన నాతోఁ బలుకవు
మేర మీరే నీ గుణాలు మెచ్చే నంటేను
దార దప్ప కందుకె తగఁ బంతా లాడేవు
యేరా నా పై కోప మెంత నీ కున్నదిరా
(॥ఆటదాని॥)
కోక గట్టుక నాతోను కోరివాదుకు వచ్చేవు
కైకొని నీ పరువులు గంటి నంటేను
యేక మై యిట్టె శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
యీడక నా గరిమెలు యెందు కైనా వచ్చురా
(||pallavi||)
ām̐ṭadānibai nī balu vaṁtayunum̐ jūbevā
nām̐ṭĕnā nī āyamulu navvula nā māḍalu
(||āḍadāni||)
vālugarĕppalu vaṁchi vaḍim̐ dappaga sūsevu
vŏli niṁdām̐ka neḍa nuṁṭi vaṁṭenu
tālimi le kappaḍigi tagam̐ gasarugŏnevu
yelani nĕṁjiri vigaṁ nĕṁtaḍām̐ dīradurā
(||āḍadāni||)
seri mārumomudom̐ bilsina nādom̐ balugavu
mera mīre nī guṇālu mĕchche naṁṭenu
dāra dappa kaṁdugĕ tagam̐ baṁtā lāḍevu
yerā nā pai koba mĕṁta nī kunnadirā
(||āḍadāni||)
koga gaṭṭuga nādonu korivādugu vachchevu
kaigŏni nī paruvulu gaṁṭi naṁṭenu
yega mai yiṭṭĕ śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
yīḍaga nā garimĕlu yĕṁdu kainā vachchurā