ఆఁటదాని వలపులు అంగడి కెక్కఁదగునా
(॥పల్లవి॥)
ఆఁటదాని వలపులు అంగడి కెక్కఁదగునా
నీటుతోనే పంతములు నెరపవలెఁ గాక
(॥ఆఁట॥)
ఆలు మగఁడును లోలో నట్టె మాఁటలాడుకోఁగా
ఆలించి యేమి వినేవే ఆసతో నీవు
చాలుకొని తమలోన సరసములాడఁగాను
తాలిమితో నీవెట్టు దండనే వుందానవే
(॥ఆఁట॥)
మునుకొని వొండొదురు మొగములు చూచుకోఁగా
కనుఁగొని ఇఁకనేమి కత చెప్పేవే
చెనకుచు నిద్దరూను చే సన్నలు గావించఁగా
కొనకెక్క నీ వెంత కొలువు సేసేవే
(॥ఆఁట॥)
ఆకెఁ దానూఁ గూడుకొని యట్టె తెరవేసుకోఁగా
సాకిరిదానవై యేమి నమ్మతించేవే
యీకడ శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడినాఁడు
చేకొని నన్నూ నేలె సిగ్గులేల పెంచేవే
(||pallavi||)
ām̐ṭadāni valabulu aṁgaḍi kĕkkam̐dagunā
nīḍudone paṁtamulu nĕrabavalĕm̐ gāga
(||ām̐ṭa||)
ālu magam̐ḍunu lolo naṭṭĕ mām̐ṭalāḍugom̐gā
āliṁchi yemi vineve āsado nīvu
sālugŏni tamalona sarasamulāḍam̐gānu
tālimido nīvĕṭṭu daṁḍane vuṁdānave
(||ām̐ṭa||)
munugŏni vŏṁḍŏduru mŏgamulu sūsugom̐gā
kanum̐gŏni im̐kanemi kada sĕppeve
sĕnagusu niddarūnu se sannalu gāviṁcham̐gā
kŏnagĕkka nī vĕṁta kŏluvu seseve
(||ām̐ṭa||)
āgĕm̐ dānūm̐ gūḍugŏni yaṭṭĕ tĕravesugom̐gā
sāgiridānavai yemi nammadiṁcheve
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍinām̐ḍu
segŏni nannū nelĕ siggulela pĕṁcheve