ఆఁటదాని చేతిదే ఆయపుఁ గాఁపురమెల్లా
(॥పల్లవి॥)
ఆఁటదాని చేతిదే ఆయపుఁ గాఁపురమెల్లా
నీటున నీకన్నియును నేరుపఁగ వలదా
(॥ఆఁట॥)
నిన్ను దూరఁదగవా నీతోఁ బొందుసేసిన
వన్నెల సతుల దూరవచ్చుఁగాక
మిన్నక దొరతనాన మించి మత్తుడవై యుంటే
తినఁగాఁ దామెల్లా నిన్ను తిద్ది తీర్చవలదా
(॥ఆఁట॥)
అలుగ నీతోఁ దగునా అండనున్న నీ సతుల
నలిని యేమిసేసినా నమరుఁగాక
కలసేటి జవ్వనపు గజరు నీకుఁ బట్టితే
తెలిపి నిన్నుఁ జాయకుఁదెచ్చుకొనవలదా
(॥ఆఁట॥)
కొంగవట్టి నీగుణాలు కొసరితే నమరునా
సంగడి నీ ఇంతులఁ గొసరుట గాక
ముంగిట శ్రీ వేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
వుంగిటిగొన్న నిన్నుఁ దామొరయఁగ వలదా
(||pallavi||)
ām̐ṭadāni sedide āyabum̐ gām̐puramĕllā
nīḍuna nīganniyunu nerubam̐ga valadā
(||ām̐ṭa||)
ninnu dūram̐dagavā nīdom̐ bŏṁdusesina
vannĕla sadula dūravachchum̐gāga
minnaga dŏradanāna miṁchi mattuḍavai yuṁṭe
tinam̐gām̐ dāmĕllā ninnu tiddi tīrsavaladā
(||ām̐ṭa||)
aluga nīdom̐ dagunā aṁḍanunna nī sadula
nalini yemisesinā namarum̐gāga
kalaseḍi javvanabu gajaru nīgum̐ baṭṭide
tĕlibi ninnum̐ jāyagum̐dĕchchugŏnavaladā
(||ām̐ṭa||)
kŏṁgavaṭṭi nīguṇālu kŏsaride namarunā
saṁgaḍi nī iṁtulam̐ gŏsaruḍa gāga
muṁgiḍa śhrī veṁkaḍeśha muṁchi nannum̐ gūḍidivi
vuṁgiḍigŏnna ninnum̐ dāmŏrayam̐ga valadā