ఆఁటదాని నన్ను నేఁటి కారడిఁ బెట్టీఁ దాను
(॥పల్లవి॥)
ఆఁటదాని నన్ను నేఁటి కారడిఁ బెట్టీఁ దాను
గాఁటముగ నెదురాడి కాదనేటి దాననా
(॥ఆఁట॥)
వేడుక గలిగితేను విడిదికి రానీవే
యేడనైనా నాతోను యేల నవ్వీని
వాడిక వలసితేను వద్దఁ గూచుండనీవే
వోడక నన్నేల యింత వొరసి చూచీని
(॥ఆఁట॥)
తనకు నే బాఁటైతే తగఁ బెండ్లాడనీవే
తనియక యెన్ని జాణతనా లాడీని
పని గలిగితే నాకు బాగాలు వెట్టనీవే
చెనకి మోవి సన్నలు సేసి యేమి చూపీని
(॥ఆఁట॥)
కరుణ నాపైఁ గలిగితే కాఁగిలించుకోనీవే
విరుల వేసి నన్నెంత వేఁడుకొనీని
యరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె
మరిగి వుండనీవే మనసెంత రేఁచీని
(||pallavi||)
ām̐ṭadāni nannu nem̐ṭi kāraḍim̐ bĕṭṭīm̐ dānu
gām̐ṭamuga nĕdurāḍi kādaneḍi dānanā
(||ām̐ṭa||)
veḍuga galigidenu viḍidigi rānīve
yeḍanainā nādonu yela navvīni
vāḍiga valasidenu vaddam̐ gūsuṁḍanīve
voḍaga nannela yiṁta vŏrasi sūsīni
(||ām̐ṭa||)
tanagu ne bām̐ṭaide tagam̐ bĕṁḍlāḍanīve
taniyaga yĕnni jāṇadanā lāḍīni
pani galigide nāgu bāgālu vĕṭṭanīve
sĕnagi movi sannalu sesi yemi sūbīni
(||ām̐ṭa||)
karuṇa nābaim̐ galigide kām̐giliṁchugonīve
virula vesi nannĕṁta vem̐ḍugŏnīni
yaravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nelĕ
marigi vuṁḍanīve manasĕṁta rem̐sīni