Aamtadaani godu soodarayyo yee magavaari

ఆఁటదాని గోడు చూడరయ్యో యీ మగవారి
Language

(॥పల్లవి॥)
ఆఁటదాని గోడు చూడరయ్యో యీ మగవారి-
కేఁటిబుద్ది వుట్టించె నీ సడపుఁ గర్మము

(॥ఆఁట॥)
యిరవెరఁగము మమ్మునింత సేసేవని నీకే
కరఁగుదు నీమోము గన్నదాఁకాను
మరిగినయాకెఁ దెచ్చి మాటలాడింపుచు నాకు
సరిగాఁగఁ జేసితివి సంగతాయఁ బనులు

(॥ఆఁట॥)
యెంచనైతి నీగుణము ఇటువంటిదయ్యీనని
వంచనలేకాడుకొందు వలతువంటా
ఇంచుకంత చలివాసి యెదుటికి దీనిఁ దెచ్చి
మంచమొక్కించుకొంటివి మంచివాయఁ బనులు

(॥ఆఁట॥)
మోసపోయి నమ్మితి నీమోహమిది నిజమంటా
ఆసపడి నవ్వుదు నీవలమేవంటా
వాసికి శ్రీవేంకటేశ వడి నన్నుఁ గూడితివి
వేసాలకాకెనంపితి వేడుకాయఁ బనులు

(||pallavi||)
ām̐ṭadāni goḍu sūḍarayyo yī magavāri-
kem̐ṭibuddi vuṭṭiṁchĕ nī saḍabum̐ garmamu

(||ām̐ṭa||)
yiravĕram̐gamu mammuniṁta sesevani nīge
karam̐gudu nīmomu gannadām̐kānu
mariginayāgĕm̐ dĕchchi māḍalāḍiṁpusu nāgu
sarigām̐gam̐ jesidivi saṁgadāyam̐ banulu

(||ām̐ṭa||)
yĕṁchanaidi nīguṇamu iḍuvaṁṭidayyīnani
vaṁchanalegāḍugŏṁdu valaduvaṁṭā
iṁchugaṁta salivāsi yĕduḍigi dīnim̐ dĕchchi
maṁchamŏkkiṁchugŏṁṭivi maṁchivāyam̐ banulu

(||ām̐ṭa||)
mosaboyi nammidi nīmohamidi nijamaṁṭā
āsabaḍi navvudu nīvalamevaṁṭā
vāsigi śhrīveṁkaḍeśha vaḍi nannum̐ gūḍidivi
vesālagāgĕnaṁpidi veḍugāyam̐ banulu