Aamtadaani gamtemjaalu naasalu puttimchevu

ఆఁటదాని గంటేఁజాలు నాసలు పుట్టించేవు
Language

(॥పల్లవి॥)
ఆఁటదాని గంటేఁజాలు నాసలు పుట్టించేవు
పాటించి యేపొద్దు నిదేపనియై వున్నాఁడవు

(॥ఆట॥)
రెప్పలెత్తి చూచిచూచి రేఁచేవు వలపులు
కప్పురము నీకాపె కానుకియ్యఁగా
నెప్పున నించుకవడి నీతోఁ బొందు సేసితెను
ఇప్పుడిట్టె యాపెగుణ మిఁక నెంత సేతువో

(॥ఆట॥)
నవ్వులు నవ్వినవ్వి నసలఁబెట్టేవు నీవు
పువ్వుల నీపాదా లాపె పూజించఁగా
జవ్వని యేపాటి నీతో సరసములాడినాను
ఇవ్వల నాపెమనసు యెంత గరఁగింతువో

(॥ఆట॥)
మొలకచన్నులు వట్టి మోవితేనె లానేవు
అలరి నీకాపె గంద మట్టె పూయఁగా
అలమేలుమంగను నేననఁగా శ్రీవేంకటేశ
ఇల నన్నేలితి వాపె నెంతగా మన్నింతువో

(||pallavi||)
ām̐ṭadāni gaṁṭem̐jālu nāsalu puṭṭiṁchevu
pāḍiṁchi yebŏddu nidebaniyai vunnām̐ḍavu

(||āḍa||)
rĕppalĕtti sūsisūsi rem̐sevu valabulu
kappuramu nīgābĕ kānugiyyam̐gā
nĕppuna niṁchugavaḍi nīdom̐ bŏṁdu sesidĕnu
ippuḍiṭṭĕ yābĕguṇa mim̐ka nĕṁta seduvo

(||āḍa||)
navvulu navvinavvi nasalam̐bĕṭṭevu nīvu
puvvula nībādā lābĕ pūjiṁcham̐gā
javvani yebāḍi nīdo sarasamulāḍinānu
ivvala nābĕmanasu yĕṁta garam̐giṁtuvo

(||āḍa||)
mŏlagasannulu vaṭṭi movidenĕ lānevu
alari nīgābĕ gaṁda maṭṭĕ pūyam̐gā
alamelumaṁganu nenanam̐gā śhrīveṁkaḍeśha
ila nannelidi vābĕ nĕṁtagā manniṁtuvo