ఆఁటదాని బలిమి నీయంతకంటె నెక్కుడా
(॥పల్లవి॥)
ఆఁటదాని బలిమి నీయంతకంటె నెక్కుడా
మేఁటివి నీయెమ్మెలెల్లా మెరసెఁగా ఇపుడు
(॥అఁట॥)
పయ్యదకొం గంటఁగాను పడఁతి దప్పించుకొంటే
అయ్యెడనే పంతాలెల్ల నాడేవు
వుయ్యాలమంచ మెక్కితే వొద్దఁ బండుండితి విట్టె
చెయ్యారా నీపంతములు చెల్లెఁగా ఇపుడు
(॥అఁట॥)
కొప్పువట్టి తియ్యఁగాను కొమ్మ నీచేఇ పట్టుకొంటే
రెప్పలెత్తి జంకించి రేసులాడేవు
అప్పుడే సిగ్గుపడితే నాయము లంటితి విట్టె
చిప్పిల నీకోరికలు సిద్దించెఁగా ఇపుడు
(॥అఁట॥)
రతికేలిఁ గూడఁగాను రామమేను చొక్కితేను
ఇతవుగా కొనగోర నెచ్చరించేవు
సతమై శ్రీవేంకటేశ జట్టిగొంటే మెచ్చే విట్టె
తతి మీఇద్దరి మేళ్లు దక్కెఁగా ఇపుడు
(||pallavi||)
ām̐ṭadāni balimi nīyaṁtagaṁṭĕ nĕkkuḍā
mem̐ṭivi nīyĕmmĕlĕllā mĕrasĕm̐gā ibuḍu
(||am̐ṭa||)
payyadagŏṁ gaṁṭam̐gānu paḍam̐ti dappiṁchugŏṁṭe
ayyĕḍane paṁtālĕlla nāḍevu
vuyyālamaṁcha mĕkkide vŏddam̐ baṁḍuṁḍidi viṭṭĕ
sĕyyārā nībaṁtamulu sĕllĕm̐gā ibuḍu
(||am̐ṭa||)
kŏppuvaṭṭi tiyyam̐gānu kŏmma nīsei paṭṭugŏṁṭe
rĕppalĕtti jaṁkiṁchi resulāḍevu
appuḍe siggubaḍide nāyamu laṁṭidi viṭṭĕ
sippila nīgorigalu siddiṁchĕm̐gā ibuḍu
(||am̐ṭa||)
radigelim̐ gūḍam̐gānu rāmamenu sŏkkidenu
idavugā kŏnagora nĕchchariṁchevu
sadamai śhrīveṁkaḍeśha jaṭṭigŏṁṭe mĕchche viṭṭĕ
tadi mīiddari meḽlu dakkĕm̐gā ibuḍu