Aamtadaani badugimta aaradi gaddaa

ఆఁటదాని బదుకింత ఆరడి గద్దా
Language

(॥పల్లవి॥)
ఆఁటదాని బదుకింత ఆరడి గద్దా
కూటములలో పనులు గుట్టు సేయవలదా

(॥ఆఁట॥)
దేవునే విన్నవించిన తియ్యముచ్చట లెల్లా
ఆవల నానతిత్తురా ఆకెతోడను
చేవ మీరి నీకు నేఁజేసినసేవలెల్లా
యేవలనైనా రచ్చ కెక్కేటివా

(॥ఆఁట॥)
చిత్తగించ నవధరించిన నాతో పొందు లెల్లా
నిత్తెమును నాటి కవి నేరువుదురా
హత్తి నీ కతలకు లోనైన రహస్యము లెల్లా
కొత్తగాఁ బరులకు వూఁకొనవచ్చేవా

(॥ఆఁట॥)
కూడేవేళ నేఁ జేసిన గుఱుతైన వూడిగాలు
సూడిదెగా నాపె కవి చూపవచ్చునా
యీడనే శ్రీవేంకటేశ యెనసితి విటు నన్ను
వేడుకపడేదే కాక వెనకతీ సేవా

(||pallavi||)
ām̐ṭadāni badugiṁta āraḍi gaddā
kūḍamulalo panulu guṭṭu seyavaladā

(||ām̐ṭa||)
devune vinnaviṁchina tiyyamuchchaḍa lĕllā
āvala nānaditturā āgĕdoḍanu
seva mīri nīgu nem̐jesinasevalĕllā
yevalanainā rachcha kĕkkeḍivā

(||ām̐ṭa||)
sittagiṁcha navadhariṁchina nādo pŏṁdu lĕllā
nittĕmunu nāḍi kavi neruvudurā
hatti nī kadalagu lonaina rahasyamu lĕllā
kŏttagām̐ barulagu vūm̐kŏnavachchevā

(||ām̐ṭa||)
kūḍeveḽa nem̐ jesina guṟudaina vūḍigālu
sūḍidĕgā nābĕ kavi sūbavachchunā
yīḍane śhrīveṁkaḍeśha yĕnasidi viḍu nannu
veḍugabaḍede kāga vĕnagadī sevā