Aamtadaana vavuduve amdarilona

ఆఁటదాన వవుదువే అందరిలోన
Language

(॥పల్లవి॥)
ఆఁటదాన వవుదువే అందరిలోన
మాటలు నీతో నాడి మరిఁగేదే

(॥ఆఁట॥)
కన్నుల నీ నవ్వులకు కలికినీచేఁతలకు
వన్నెల నీరహనుఁడు వలచెఁగదే
చన్నుల నీ మొనలకు చవుల నీమోవికి
పన్నికకాఁకలతోడ బాఁతిపడీఁగదవే

(॥ఆఁట॥)
బిత్తరినీచూపులకు పిరుఁదుబిగువులకు
బత్తిసేసి పాయలేక పైకొనీఁగదే
గుతపుపాదములకు గొప్పతురుమునకు
మత్తిలి యేపొద్దును మరులాయఁగదవే

(॥ఆఁట॥)
కందువనీకాఁగిటికి గళకాంతులకును
అందుక శ్రీవేంకటేశుఁ డలమెఁగదే
పొందులజవ్వనానకు భోగపురతులకును
ముందుముందే లోలుఁడై మొక్కెఁగదె

(||pallavi||)
ām̐ṭadāna vavuduve aṁdarilona
māḍalu nīdo nāḍi marim̐gede

(||ām̐ṭa||)
kannula nī navvulagu kaliginīsem̐talagu
vannĕla nīrahanum̐ḍu valasĕm̐gade
sannula nī mŏnalagu savula nīmovigi
pannigagām̐kaladoḍa bām̐tibaḍīm̐gadave

(||ām̐ṭa||)
bittarinīsūbulagu pirum̐dubiguvulagu
battisesi pāyalega paigŏnīm̐gade
gudabubādamulagu gŏppadurumunagu
mattili yebŏddunu marulāyam̐gadave

(||ām̐ṭa||)
kaṁduvanīgām̐giḍigi gaḽagāṁtulagunu
aṁduga śhrīveṁkaḍeśhum̐ ḍalamĕm̐gade
pŏṁdulajavvanānagu bhogaburadulagunu
muṁdumuṁde lolum̐ḍai mŏkkĕm̐gadĕ